పోలీస్‌ ఉన్నతాధికారులతో సిఎం సమీక్ష

cm kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ పోలీస్ ఉన్నతాధికారులతో ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. శాంతి భద్రతలపై విస్తృతస్థాయి సమీక్ష చేస్తున్నారు. తెలంగాణలో మావోయిస్టుల కదలికలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు మహిళల భద్రత, డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఇటీవల కాలంలో పొరుగు రాష్ట్రాలుగా ఉన్న ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా ఈ రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి మావోయిస్టులు ప్రవేశించారనే వార్తలు వెలువడుతున్నాయి. స్వయంగా కేంద్ర ఇంటిలిజెంట్ వర్గాలే రాష్ట్ర ప్రభుత్వానికి మావోయిస్టుల కదలికలపై సమాచారాన్ని అందించాయి. ఈ సమావేశంలో డీజీపీ, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు పాల్గొన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/