ప్రతి విషయంలో కుంగుబాటు!

మానసిక వికాసం…

Depression in every respect

ఒక్కోసారి కంటి మీదకు కునుకు రాదు. వచ్చినా కలత నిద్రే. మరోసారి 7,8 గంటలు నిద్రపోయాక కూడా అలసట గానే అన్పిస్తుంది. ఈ అలసట మనసుకే కాదు. శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. దీంతో ఒళ్ళు నొప్పులూ, తలనొప్పి వంటివి సహజంగానే ఇబ్బంది పెడతాయి. వీటికి ఒత్తిడి, కుంగుబాటు కారణం కావొచ్చట. మరి ఇలాంటి లక్షణాలు తరచూ కనిపిస్తుంటే , చికిత్స తీసుకోవటానికి వెనుకాడొద్దు.

చిన్న చిన్న విషయాలు గుర్తుండవు .. తెలియని దిగులు వెంటాడుతుంది.. దేని మీదా ఏకాగ్రత ఉండదు. అప్పటికప్పుడు భావోద్వేగాల్లో తీవ్ర మార్పులు కన్పిస్తాయి. చిన్న విషయానికే ఏడవటం , తీవ్రమైన కోపం , అపరాధ భావం .వంటివన్నీ కలగలిపి కన్పిస్తుంటాయి.

Depression in every respect

లైంగిక వాంఛలు తగ్గటం కూడా కంగుబాటు లక్షణమే. మెదడులోని అనేక విషయాలు అలజడి రేపటమే ఇందుకు కారణం . ఎక్కువ రోజులు భాగస్వామికి దూరంగా ఉండటానికి యత్నిస్తుంటే ఓసారి వైద్యులను సంప్రదించటమే మేలు.