మెచ్చిన మనసును గెలవాలంటే

జీవన వికాసం

To win the admirable heart
To win the admirable heart

ఇప్పుడంతా ఆన్‌లైన్‌ డేటింగ్‌. ఒకరితో ఒకరు మాట కలపాలన్నా, మనసు పడాలన్నా అంతా డేటింగ్‌ యాప్స్‌ ద్వారా జరిగిపోతున్నాయి.

అయితే ఆన్‌లైన్‌లో అవతలి వ్యక్తిని ఆకట్టుకోవాలంటే ప్రొఫైల్‌ ఫొటో, చాటింగ్‌ తీరు, మాట్లాడే విధానం, ఇలా అన్ని బాగుండాలి.

అప్పుడే మిమ్మల్ని కలిసేందుకు ఎదుటి వారు ఆసక్తి చూపుతారు. మీరు మనసు పడినవారిని మెప్పించాలంటే..

మీకు నచ్చినవి,నచ్చనివి, వ్యక్తిగతంగా మీరు ఎలాంటి వారు వంటి విషయాలు ప్రొఫైల్‌లో లేన్నా, చూడగానే చదవాలనిపించేలా, ఆసక్తిగా ఉండాలి.

క్లుప్తంగా, అర్ధవంతంగా తక్కువ పదాల్లో ఉండాలి. ప్రొఫైల్‌ ఫొటోలో మీ ముఖం ఆకట్టుకునేలా ఉంటేనే అవతలి వ్యకిత ఛాటింగ్‌ కొనసాగిస్తారు.

లేదంటే మొహమాటం లేకుండా నో చెప్పేస్తారు. అలాగనీ ఫొటో కవ్వించేలా, గంభీరంగా ఉండకూడదు. డేటింగ్‌ యాప్‌లో కొంతసేపు ఛాటింగ్‌ చేశాక ఎవరో ఒకరు నచ్చుతారు.

అలాగని వారితో గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడటం, మెసేజ్‌లు పంపించడం చేయకూడదు. విసిగించే విధంగా ప్రవర్తించకూడదు. వారితో సన్నిహితంగా మెలిగేందుకు కొంత సమయం తీసుకోవాలి. తరువాత అన్ని సవ్యంగా జరుగుతాయి.

ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం కొత్తగా మొదలెట్టారు కాబట్టి మొదట్లో మీ మధ్య సంభాషణ చక్కగా సాగుతుంది.

అంతమాత్రాన వారిని సామాజిక మాధ్యమాల్లో విసిగెత్తించేలా పోస్టులు పెట్టకూడదు. అలానే వారి ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వివరాలు తప్పుగా అర్దం చేసుకునే అవకాశముంటుంది.

దాంతో మీ మీద తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుంద. మీరు కొత్తగా డేటింగ్‌ యాప్‌లో చేరి ఉండవచ్చు.. లేదా ఆన్‌లైన్‌న డేటింగ్‌లో ఎక్కువగా పాల్గొనేవారు కావచ్చు.

ఇలాంటివి ప్రతిసారి సరికొత్త అనుభూతికి లోనవుతారు. దాన్ని పూర్తిగా ఆస్వాదించాలి.అయితే అందుకు మీ సమయాన్ని, ఓపికను వెచ్చిస్తే ఆన్‌లైన్‌ డేటింగ్‌లో ప్రతి క్షణాన్ని ఆనందించవచ్చు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/