ఆమ్లా ఊరగాయ

సాధారణంగా ఉసిరికాయలతో ఎన్నో రకాలుగా చేయవచ్చు. యేడాది పాటు నిలువ ఉండే పచ్చళ్లే కాకుండా రెండు మూడు నెలల పాటు ఉండే పచ్చళ్లు కూడా తయారు చేసుకోవచ్చు. ఉసిరికాయల్లో నిమ్మరసం కలిపి ఊరగాయ పెట్టుకుంటే రసం ఎక్కువగా ఊరుతుంది. రుచిగా కూడా ఆ ఊరగాయ ఎలా తయారుచేయాలో తెలుసుకోండి మరి!
కావలసిన పదార్థాలు
ఉసిరికాయలు – కిలో
ఉప్ప – అరకప్పు
పసుపు – ఒక టీ స్పూన్‌
నువ్వుల నూనె – ముప్పావు కప్పు
కారం పొడి – అరకప్పు
ఇంగువ – ఒక టీ స్పూన్‌
మెంతి పొడి – పావు కప్పు
నిమ్మకాయలు – నాలుగు
మధ్యస్థంగా ఉండే సైజులో
ఆవాలు – అర టీ స్పూన్‌
తయారుచేసే విధానం
ఉసిరికాయలను నీళ్లలో కడిగి ఆరబెట్టాలి. పెద్ద పాన్‌ తీసుకుని నువ్వుల నూనె వేడిచేయాలి. నూనె వేడిక్కన తరువాత అందులో ఆవాలు, ఇంగువ వేయాలి. ఆవాలు చిటపటలాడం మొదవ్వగానే ఆ నూనెలో ఉసిరికాయలు వేసి మెత్తబడేవరకు మూతపెట్టి స్టవ్‌ మీద సన్నని మంటపై ఉంచాలి. పాన్‌లోని ఉసిరికాయలు మెత్తబడిన తర్వాత స్టవ్‌ మీద నుంచి దించి ఉసిరికాయలను చల్లారనివ్వాలి. చల్లారిన ఉసిరికాయల్లో ఉప్పు, కారం, పసుపు, మెంతిపొడి వేయాలి. అందులో నిమ్మరసం పిండి మొత్తం మిశ్రమాన్ని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మూడు రోజులు అలాగే జాడీలో నాననివ్వాలి. ఇలా చేస్తే రసాన్ని ఉసిరికాయలు బాగా పీల్చుకుంటాయి. అప్పుడు వాటిని తింటే ఎంతో రుచిగా ఉంటాయి. దీనిని గాజు సీసాలో పెట్టి గట్టిగా మూతపెట్టి వాడుకోవాలి. ఈ ఊరగాయ మూడు నాలుగు నెలలు నిలువ ఉంటుంది.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/