అధ్యక్ష అభ్యర్థిగా జోసెఫ్‌ బైడెన్‌..పార్టీ అధికారిక ప్ర‌క‌ట‌న‌

మద్దతుగా నిలిచిన మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జిమ్మీ కార్టర్

Joe Biden formally nominated as Democratic candidate

అమెరికా: అమెరికా ఎన్నిక‌ల్లో డెమోక్ర‌టిక్ పార్టీ అధ్య‌క్ష అభ్య‌ర్థిగా జోసెఫ్ బైడెన్‌ను అధికారికంగా ప్ర‌క‌టించారు. డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ రెండో రోజున బైడెన్ అభ్యర్థిత్వాన్ని పార్టీ ఖరారు చేసింది. ఈ కార్యక్రమానికి మాజీ దేశాధ్యక్షులు బిల్ క్లింటన్, జిమ్మీ కార్టర్ లతో పాటు, రిపబ్లికన్ స్టేట్ కార్యదర్శి కోలిన్ పావెల్, ఇతర నాయకులు హాజరయ్యారు. ఇక తన పేరును ప్రకటించిన తరువాత జో బైడెన్ స్పందిస్తూ, ఇది తన జీవితంలో అతిపెద్ద గౌరవమని అన్నారు. తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలంటూ తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. కాగా, ఎన్నికలకు మరో 77 రోజులు ఉండగా, ఓటింగ్ డేట్ వరకూ దేశమంతా విస్తృతంగా పర్యటించాలని బైడెన్ ఇప్పటికే షెడ్యూల్ ను నిర్ణయించుకున్నారు. తన వైఖరితో ట్రంప్ సృష్టించిన గందరగోళాన్ని సరిచేసే అనుభవం బైడెన్ కు ఉన్నదని డెమోక్రాట్ నేతలు వ్యాఖ్యానించారు.


కాగా ఈ ఏడాది న‌వంబ‌ర్ 3వ తేదీన అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో ఆయ‌న పోటీప‌డుతారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/