బీఆర్ఎస్- బీజేపీ కలిసిపోయాయి – రాహుల్

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి రేపటితో తెరపడనుంది. దీంతో అన్ని పార్టీల అగ్ర నేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటన లు చేస్తూ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. రెండు రోజులుగా రాష్ట్రంలో పర్యటిస్తూ సందడి చేస్తున్న రాహుల్ గాంధీ…బిఆర్ఎస్ , బిజెపి లపై విరుచుకపడ్డారు. బీఆర్ఎస్- బీజేపీ కలిసిపోయాయని చెప్పడానికి ఏకైక నిదర్శనం నేనే. ఎందుకంటే నాపై ప్రధాని మోడీ ఇప్పటివరకు 24 కేసులు పెట్టారు. సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలను నాపైకి వదిలారు. అవి నిత్యం నాపై దాడి చేస్తూనే ఉన్నాయి.

నా ఇల్లు లాక్కున్నారు, కేసులు పెట్టి పార్లమెంట్ నుంచి వెళ్లగొట్టారు. ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్నీ పెట్టారు. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడితే చాలు.. కొత్త కేసు ఒకటి నాపై పెడతారు. కానీ కేసీఆర్ మీద ఒక్కటి కూడా లేదు. అంటే దానర్థం వారిద్దరూ ఒకటేనని మీకు అర్థమవుతోందా? వీరికి ఎంఐఎం కూడా తోడైంది, వీరేం చెబితే అది తానా తందాన అంటుంది” అని రాహుల్ గాంధీ అన్నారు.

ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాదించబోతుందని , మొదటి ఫైల్ మీదే ఆరు ఉచిత పథకాలపై సంతకం చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు రాహుల్.