పట్టాలు తప్పిన బెంగళూరు ఎక్స్‌ప్రెస్..రైలులో 2348 మంది ప్రయాణికులు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తమిళనాడు లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఈ తెల్లవారు జామున బెంగళూరు ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ధర్మపురం జిల్లాలోని తొప్పూర్-శివడి స్టేషన్ల మధ్య ఈ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. బెంగళూరు డివిజన్‌లోని తొప్పూరి-శివ్డీ ఘాండ్‌ మధ్య పర్వతంపై నుంచి బండరాళ్లు పట్టాలపై పడడం తో రైలులో ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. పెద్ద శబ్దం చేస్తూ రైలు అక్కడికక్కడే నిలిచిపోయింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. చీకటి కావడం ఏ జరిగిందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో అయిదు బోగీలు దెబ్బతిన్నాయి.

ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఏ ఒక్కరు కూడా గాయపడలేదని, ప్రాణనష్టం సంభవించలేదని నైరుతి రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రమాదం సమయంలో రైలు లో 2,348 మంది ప్రయాణికులు ఉన్నారు. థలస్సేరి, వడక్కార, కోజికోడ్, షోరనూర్ జంక్షన్, పాలక్కాడ్, కోయంబత్తూర్ జంక్షన్, తిరుప్పూర్, ఈరోడ్ జంక్షన్, సేలం జంక్షన్, ధర్మపురి, హోసూర్, బానస్‌వాడి మీదుగా ఉదయం 7:40 నిమిషాలకు బెంగళూరుకు చేరాల్సి ఉంది.