నేడు ఏపి కేబినెట్‌ సమావేశం

చర్చించే అంశాలు ఇవే..

AP CM YS Jagan
AP CM YS Jagan

అమరావతి: నేడు ఏపి కేబినెట్‌ సమావేశం కానుంది. కేబినెట్‌లో పలు కీలక అంశాలపై చర్చించనుంది. పలు సంక్షేమ పథకాలతో పాటు ఇటీవల ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానానికి జగన్ కేబినెట్ ఆమోదం తెలపనుంది. నవరత్నాల్లో మరో హామీ అమలు దిశగా సిఎం జగన్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వైఎస్ఆర్ ఆసరా పథకానికి ఏపి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవొచ్చని తెలుస్తోంది. గోదావరి జిల్లాల్లో వరద పరిస్థితులపై కేబినెట్‌లో చర్చ జరగనుంది. పరిస్థితులకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం సమీక్షించనుంది. ఏపిలో ప్రస్తుత ఖరీప్ పంటల పరిస్థితిపై కేబినెట్‌లో చర్చించనున్నారు. కొత్తగా బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుపై ఏపి మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. డిసెంబర్ నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ అంశంపై కేబినెట్‌లో చర్చ జరగనుంది. దీంతో పాటు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకంపై రాష్ట్ర కేబినెట్ చర్చించనున్నట్టు తెలుస్తోంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/