ఢిల్లీలో కరోనా వైరస్‌ థ‌ర్డ్ వేవ్‌..సిఎం

ఢిల్లీలో కరోనా వైరస్‌ థ‌ర్డ్ వేవ్‌..సిఎం
cm Aravind Kejriwal

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశ రాజ‌ధాని ఢిల్లీలో మళ్లీ పెరుగుతుంది. కొత్త‌గా న‌మోద‌య్యే కేసుల సంఖ్య గ‌త కొంత కాలంగా త‌గ్గుతూ వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ఇటీవ‌ల మ‌ళ్లీ పెద్ద సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోదవుతున్నాయి. తాజాగా సిఎం అర‌వింద్ కేజ్రివాల్ కూడా ఢిల్లీలో కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న‌ద‌ని చెప్పారు. కొవిడ్‌19 కేసుల విస్త‌ర‌ణ‌లో దీన్ని థ‌ర్డ్ వేవ్‌గా చెప్ప‌వ‌చ్చ‌ని ఆయన పేర్కొన్నారు. కేసుల సంఖ్య పెరుగుతుండంతో ఢిల్లీ అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంద‌నిసిఎం కేజ్రివాల్ తెలిపారు. ప‌రిస్థితిని తాము ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తున్నామ‌ని చెప్పారు. మునుప‌టిలా కొత్త కేసులు విజృంభించ‌కుండా అవ‌స‌ర‌మైన‌ అన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. ‌


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/