అయినా ఫోన్ హ్యాక్ అవుతూనే ఉంది

నా ఫోన్ సెట్ ను ఐదు సార్లు మార్చాను: ప్రశాంత్ కిశోర్

న్యూఢిల్లీ : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ పలుమార్లు హ్యాకింగ్ కు గురైనట్టు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు తన ఫోన్ ను ఐదుసార్లు మార్చానని… అయినప్పటికీ తన ఫోన్ హ్యాకింగ్ కు గురవుతూనే ఉందని చెప్పారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఆయన ఫోన్ ఈ నెల 14న హ్యాకింగ్ కు గురైంది. కాంగ్రెస్ కీలక నేతలతో ఆయన చర్చలు జరుపుతున్న సమయంలో ఫోన్ హ్యాక్ అయింది.

కాగా, ప్రస్తుతం మన దేశాన్ని పెగాసిస్ స్పైవేర్ కుదిపేస్తోంది. పార్లమెంటును సైతం ఈ విషయం షేక్ చేస్తోంది. లోక్ సభ, రాజ్యసభల్లో ఇతర విషయాలను పక్కన పెట్టి ఈ స్పైవేర్ పై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/