పాక్ మంత్రి ఫవాద్‌కు కేజ్రీవాల్ కౌంటర్
ఢిల్లీ ఎన్నికలు పూర్తిగా భారత్ అంతర్గ విషయం

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పై పాకిస్తాన్ మంత్రి ఫవాద్ చౌదరి చేసిన వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఢిల్లీ ఎన్నికలు పూర్తిగా భారత్ అంతర్గత విషయమని.. ఇందులో ఎవరూ తలదూర్చాల్సిన అవసరం లేదని చురకలు అంటించారు. ఫిబ్రవరి 8న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ని ఓడించడం ద్వారా
మోడీకి బుద్ధి చెప్పాలని పాక్ మంత్రి ఫవాద్ ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు. కశ్మీర్ అంశం, పౌరసత్వ సవరణ చట్టంపై బాహ్య ప్రపంచం నుంచి వస్తున్న విమర్శలు, ఆర్థిక మందగమనం కారణంగా ప్రధాని నరేంద్ర మోడీకి మతి చలించిందని.. అందుకే అర్థంపర్థం లేని వ్యాఖ్యలతో ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారంటూ ఫవాద్ ట్వీట్ చేశారు. (ఢిల్లీ అసెంబ్లీ ఈ క్రమంలో ఫవాద్ ట్వీట్‌పై స్పందించిన అరవింద్ కేజ్రీవాల్… నరేంద్ర మోడీ భారత ప్రధాన మంత్రి. ఆయన నాకు కూడా ప్రధాన మంత్రే. ఢిల్లీ ఎన్నికలు భారత అంతర్గత అంశం. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న వారి జోక్యాన్ని మేము అస్సలు సహించం. భారత ఐకమత్యానికి హాని తలపెట్టాలని పాక్ ఎంతగా ప్రయత్నించినా ఫలితం ఉండదు అంటూ కౌంటర్ ఇచ్చారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/