కోహ్లీసేన మళ్లీ సూపర్‌ విక్టరీ

Team-India-won-another-super-over-match
Team-India-won-another-super-over-match

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌లో జరిగిన నాలుగో టీ20లో కోహ్లిసేన మరో సూపర్‌ విక్టరీ సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన సూపర్‌ ఓవర్‌లో న్యూజిలాండ్‌ తొలుత 13 పరుగులు చేసింది. అనంతరం భారత్‌ ఒక వికెట్‌ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సూపర్‌ ఓవర్‌లో కేఎల్‌ రాహుల్‌ తొలి రెండు బంతులను ఒక సిక్స్‌, ఒక ఫోర్‌ బాది, మూడో బంతికి భారీ షాట్‌ ఆడబోయి ఔటయ్యాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మిగతా పని పూర్తి చేసి జట్టును గెలిపించాడు. అంతకు ముందు భారత్‌ నిర్ధేశించిన 166 పరుగులు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. దీంతో ఈ మ్యాచ్‌ కూడా టైగా మారి సూపర్‌ ఓవర్‌కు దారితీసింది. ఈ సందర్భంగా బుమ్రా సూపర్‌ ఓవర్‌లో ఒక వికెట్‌ తీసి 13 పరుగులిచ్చాడు. కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ ధాటిగా ఆడి జట్టును గెలిపించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/