వాణిజ్య సిలిండర్ ధర పెంపు

రూ.250 పెరిగిన సిలిండర్ ధర

న్యూఢిల్లీ: నిత్యావసర ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యులకు మరో షాక్ తగిలింది. ఏప్రిల్ నెల ప్రారంభం అవుతున్న తొలి రోజే కమర్షియల్ సిలిండర్ ధరలు భారీగా పెరిగిపోయాయి. 19 కిలోల సిలిండరు ఏకంగా రూ.250 పెరిగింది. దీంతో కమర్షియల్ సిలిండర్ ధర.2,253కు చేరింది. పెరిగిన ధరలు ఇవాల్టి నుంచి అమలు కానున్నాయి. అయితే, 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఊరట లభించింది. గృహ అవసరాల కోసం వినియోగించే సిలిండర్ల ధర మాత్రం పెంచలేదు. తెలుగు రాష్ట్రాల్లో అయితే సిలిండర్ ధర రూ.1000కి పైగానే ఉంది. అయితే 10 రోజుల కిందట మాత్రం ఈ సిలిండర్ ధర పెరిగిన విషయం తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/