ఇబ్రాహీంపట్నం బాధిత మహిళలను పరామర్శించిన కేఏ పాల్

రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ వికటించిన నలుగురు మహిళలు మృతి చెందిన సంగతి తెలిసిందే. మరికొంతమంది నిమ్స్ హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటన ఫై ఇప్పటికే పలు రాజకీయ పార్టీల నేతలు ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ…బాధిత కుటుంబాలను ఆదుకోవాలని హెచ్చరిస్తున్నారు.

ఈ తరుణంలో ఈరోజు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చికిత్స తీసుకుంటున్న మహిళలను పరామర్శించారు. వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బాధిత మహిళలు ఒక్కొక్కరికి రూ.10,116 చెక్కులను పాల్ అందజేశారు. భయాందోళలకు గురికావద్దని ధైర్యం చెప్పారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించడం వంటి ఘటన జరగడం దురదృష్టకరమని కేఏ పాల్ అన్నారు. 17మంది హాస్పిటల్ లో చేరగా.. ఆరుగురు డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. ఒత్తిడి కారణంగా వైద్యులు, సిబ్బంది ఒకింత అసహనం వ్యక్తం చేసినా బాధపడకుండా వారికి సహకరించాలని సూచించారు.