14వ రోజుకు చేరిన రైతు సంఘాల నిరసన

14వ రోజుకు చేరిన రైతు సంఘాల నిరసన
Farmers-protest

న్యూఢిల్లీ: కేంద్ర నూతన వ్యవసాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతు సంఘాల ఆందోళ‌న‌లు 14వ రోజుకు చేరాయి. హ‌ర్యానా ఢిల్లీ స‌రిహ‌ద్దులోని సింఘు బోర్డ‌ర్ వ‌ద్ద రైతులు త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు. అగ్రి చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా నిన్న రైతులు త‌ల‌పెట్టిన భార‌త్ బంద్ విజ‌య‌వంత‌మైన విష‌యం విదిత‌మే. ఇక నిన్న రాత్రి కేంద్ర మంత్రి అమిత్ షా రైతు సంఘాల ప్ర‌తినిధుల‌తో స‌మావేశ‌మై వారి డిమాండ్ల‌పై చ‌ర్చించారు. సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయ‌డం కుద‌ర‌ద‌ని అమిత్ షా తేల్చిచెప్పారు. చ‌ట్టాల్లో కొన్ని స‌వ‌ర‌ణ‌ల‌కు స‌ముఖంగా ఉన్నామ‌ని షా స్ప‌ష్టం చేశారు. స‌వ‌ర‌ణల ప్ర‌తిపాద‌న‌ల‌ను రైతుల‌కు నేడు లిఖిత‌పూర్వ‌కంగా కేంద్రం అందించ‌నుంది. స‌వ‌ర‌ణ‌ల జాబితాపై చ‌ర్చించి రైతు సంఘాలు నిర్ణ‌యం తీసుకోనున్నాయి. ఈ క్ర‌మంలో కేంద్ర మంత్రుల‌తో బుధ‌వారం జ‌ర‌పాల్సిన చ‌ర్చ‌లు వాయిదా ప‌డ్డాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/