యశోద ఫస్ట్ డే కలెక్షన్స్

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన యశోద మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. హ‌రీష్ శంక‌ర్‌, హ‌రీష్ నారాయ‌ణ్ సంయుక్తంగా డైరెక్ట్ చేసిన ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదలైంది. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు , అభిమానులు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ చిత్ర యూనిట్ కు కంగ్రాట్స్ చెపుతున్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు పాజిటివ్ టాక్ ఇస్తుండడం తో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఈ మూవీ ఫస్ట్ డే బ్రహ్మాండమైన వసూళ్లు రాబట్టింది. అమెరికాలో యశోద చిత్రానికి మంచి క్రేజ్ లభించింది. ప్రీమియర్స్ రూపంలో 60k డాలర్లు నమోదు చేసింది. అయితే తొలి రోజు కంటే రెండో రోజు ఈ సినిమా స్క్రీన్ కౌంట్ భారీగా పెరిగింది. తొలి రోజున ఈ చిత్రం 200K డాలర్లను అంటే.. 1.60 కోట్లకుపైగా నమోదు చేసింది. ప్రీమియర్ల రూపంలో 60k, తొలి రోజు 134886 డాలర్లు వసూలు చేసింది. హైదరాబాద్‌లో తొలి రోజు 64 లక్షల రూపాయలను వసూలు చేసింది. ఆంధ్రాలో భీమవరం 2 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. వైజాగ్‌లో 4 లక్షల గ్రాస్‌ను నమోదు చేసింది.

యశోద సినిమా తెలుగులో 3 కోట్లు, హిందీలో 10 లక్షలు, తమిళంలో 10 లక్షలు, మలయాళంలో 10 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 3.25 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్‌లో 80 లక్షలు కలుపుకొంటే.. ఈ చిత్రం మొత్తంగా 4 కోట్ల వసూళ్లను రాబట్టింది.