కాంగ్రెస్​ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ గా దీపాదాస్​ మున్షీ

ఇప్పటివరకు కాంగ్రెస్​ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ గా మాణిక్​రావ్​ ఠాక్రే వ్యవహరించగా..ఇప్పుడు ఆయన స్థానంలో దీపాదాస్​ మున్షీ ను నియమించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం వెనుక మాణిక్​రావ్​ ఠాక్రే పనితీరు ఏంటో ఉంది..ఇక ఇప్పుడు త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధిష్టానం పలు మార్పులు చేసింది. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో పార్టీ జనరల్​ సెక్రటరీలు, ఇన్​చార్జులను మార్చింది.

కాంగ్రెస్​ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​గా, జనరల్​ సెక్రటరీగా దీపాదాస్​ మున్షీని నియమించింది. కేరళ, లక్షద్వీప్​తో పాటు అదనంగా ఆమెకు తెలంగాణ బాధ్యతలను అప్పగిస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రానికి పార్టీ చీఫ్​ అబ్జర్వర్​గా పనిచేసిన మున్షీ.. పార్టీ నేతలను కో ఆర్డినేట్​ చేయడంలో సక్సెస్​ అయ్యారనే పేరు పార్టీలో ఉన్నది. ఈ క్రమంలోనే దీపాదాస్​ మున్షీకి రాష్ట్ర బాధ్యతలను అప్పగించినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రానికి ఇన్​చార్జ్​గా ఉన్న మాణిక్​ రావ్​ ఠాక్రేకు గోవా, దాద్రానగర్​ హవేలి, డయ్యూ డామన్​కు ఇన్​చార్జ్​గా బాధ్యతలు అప్పగించారు. అలాగే గతంలో ఏఐసీసీ మీడియా కో ఆర్డినేటర్​గా తెలంగాణలో పనిచేసిన సీడబ్ల్యూసీ మెంబర్​ అజయ్​ కుమార్​ను ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి ఇన్​చార్జ్​గా నియమించారు.