ఏపి టెన్త్‌ క్లాస్‌ పరీక్షల ఫలితాలు విడుదల

results

అమరావతిః ఏపిలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షల‌ ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. విజ‌య‌వాడ‌ద‌లో ఉద‌యం 11 గంట‌ల‌కు విద్యాశాఖ క‌మిష‌న‌ర్ సురేశ్ ఫ‌లితాల‌ను విడుదల చేశారు. రాష్ట్ర‌వ్యాప్తంగా 3,743 ప‌రీక్ష కేంద్రాల్లో మార్చి 18 నుంచి 30వ తేదీ వ‌ర‌కు ప‌రీక్ష‌లు జ‌రిగాయి. 6.23 ల‌క్ష‌ల మంది విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యారు. 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణుల‌య్యారు. ఫ‌లితాల్లో బాలిక‌లే పైచేయి సాధించారు. బాలుర ఉత్తీర్ణ‌త శాతం 84.32గా న‌మోదు కాగా, బాలిక‌ల ఉత్తీర్ణ‌త శాతం 89.17గా న‌మోదైంది.

ఈ ఫలితాల కోసం ఈ లింక్‌పై క్లిక్‌ చేయండి..
https:// results. bse.ap.gov.in/

కాగా, మార్చి 18 నుంచి 30వ తేదీ వరకూ పది పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఎనిమిది వరకూ మూల్యాంకనం నిర్వహించారు. మొత్తం 47,88,738 జవాబు పత్రాల వేల్యుయేషన్‌ కోసం 25 వేల మంది టీచర్లను నియమించి 26 జిల్లాల్లో సెంటర్లను నిర్వహించడం జరిగింది. దీంతో 22 రోజుల్లోనే వాల్యుయేషన్ పూర్తి చేసి, ఇవాళ విడుదల చేస్తున్నారు. ఇందుకు ఎన్నికల సంఘం కూడా అనుమతి ఇచ్చింది. గతేడాది కంటే.. ముందుగానే ఈసారి ఫలితాలు వచ్చేశాయి.