ముద్రగడకు షాక్ ఇచ్చిన కూతురు

ముద్రగడ పద్మనాభంకు షాక్ ఇచ్చింది ఆయన కూతురు క్రాంతి. వైసీపీ లో చేరిన దగ్గరి నుండి ముద్రగడ పద్మనాభం..పవన్ కళ్యాణ్ ఫై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఆయన మాట్లాడుతూ..పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని..ఆలా చేయకపోతే తన పేరు ను ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటున్నానని సవాలు కూడా విసిరారు. దీనిపై జనసేన నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇలా రోజు రోజుకు పద్మనాభం ఫై వ్యతిరేకత పెరుగుతున్న క్రమంలో ఆయన కూతురు ఓ వీడియో షేర్ చేసి పవన్ కళ్యాణ్ కు తన మద్దతును తెలిపి తండ్రికి షాక్ ఇచ్చింది.

పవన్‌కు మా నాన్న చేసిన ఛాలెంజ్ చాలా బాధాకరమైనదన్నారు. పవన్‌ను ఓడించి పిఠాపురం నుంచి పంపించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని శపథం చేశారు. ఈ కాన్సెప్ట్ ఏంటో తనకు అర్థం కాలేదన్న ఆమె, ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదన్నారు. పోటీ ఎప్పుడు హుందాగా ఉండాలని, కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.

ఎన్నికల తర్వాత మానాన్నను వైసీపీ వదిలివేయడం ఖాయమన్నారు క్రాంతి. ఈ విషయంలో మా నాన్నను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పవన్ గెలుపుకు తన వంతు కృషి చేస్తారన్నారు ముద్రగడ కూతురు క్రాంతి. కూతురు క్రాంతి వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు ముద్రగడ. రాజకీయం రాజకీయమే.. కూతురు కూతురే అన్నారాయన. తన కూతురుకి మ్యారేజ్ అయిపోయిందని, ఇప్పుడు ఆమెకు మెట్టినిల్లే ముఖ్యమన్నారు. తన కూతురుతో కొందరు తిట్టించడం బాధాకరమన్నారు.