‘గుంటూరు కారం ‘ నుండి శ్రీలీల ఘాటు లుక్ రిలీజ్

ధమాకా ఫేమ్ శ్రీలీల ..ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే . వాటిలో గుంటూరు కారం ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో హ్యాట్రిక్ మూవీ గా వస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ క్రమంలో ఈరోజు శ్రీలీల బర్త్ డే సందర్బంగా ఆమె తాలూకా లుక్ ను మేకర్స్ రిలీజ్ చేసి అభిమానుల్లో సంబరాలు నింపారు.

ఈ లుక్ శ్రీలీల ..చీర కట్టుకుని నెయిల్ పోలిష్ వేసుకుంటూ… బుట్టబొమ్మలా మెరిసిపోయింది. లుక్ చూస్తుంటే… సినిమాలో ఆమె సంప్రదాయబద్ధంగా కనిపించే పాత్రలో సందడి చేస్తారని అర్థం అవుతోంది. ఇక మహేష్ బాబు తండ్రి, దివంగత సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా సినిమా టైటిల్ వెల్లడించారు. ‘మాస్ స్ట్రైక్’ పేరుతో వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. ఆ విజువల్స్ సోషల్ మీడియాను షేక్ చేశారు. ఇంతకు ముందు ఎప్పుడూ ఎవరూమహేష్ బాబును చూపించనటువంటి మాస్ అవతారంలో త్రివిక్రమ్ చూపించారు. మిర్చి యార్డులో ఫైట్స్ విజువల్స్ ఘట్టమనేని అభిమానులను మాత్రమే కాదు… సగటు సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇక ఈ మూవీ లో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. ‘మహర్షి’ తర్వాత వాళ్ళిద్దరి కలయికలో వస్తున్న రెండో చిత్రమిది. ఇందులో జగపతి బాబు సైతం కీలక పాత్ర చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం మీద సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న విడుదల కానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్. నవీన్ నూలి ఎడిటర్ కాగా… ఎఎస్ ప్రకాష్ కళా దర్శకత్వం వహిస్తున్నారు.