దసరా ట్రైలర్ రిలీజ్..ఊర మాస్ గా ఉంది

నాని , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్నమాస్ ఎంటర్టైనర్ ‘దసరా’. నూతన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మార్చి 30 న పాన్ ఇండియా గా పలు భాషల్లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్ కార్య క్రమాలపై దృష్టి సారించారు మేకర్స్. ఇప్పటికే సినిమాలోని పలు సాంగ్స్ రిలీజ్ చేసి ఆకట్టుకోగా..తాజాగా చిత్ర ట్రైలర్ ను మంగళవారం విడుదల చేసారు. ట్రైలర్ అంత కూడా ఊర మాస్ గా ఉంది. ఇప్పటివరకు కూల్ గా కనిపించి లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న నాని..ఫస్ట్ టైం దసరా లో ఊర మాస్ లుక్ లో కనిపించి అదరగొట్టాడు.

‘ఒక్కొక్కడికి మొలదారం కింద గుడాలు రాల్తాయ్ బాంచత్’ , ‘పది తలకాయలున్నోడే ఒక్క తలకాయ్ ఉన్నోని చేతిలో కుక్కచావు చచ్చిండు. పురాణాలను మించిన బతుకులా మనయి’ అంటూ మాస్ డైలాగ్స్ తో ఆకట్టుకున్నాడు. నాని యాస ఈ సినిమాలో మరింత హైలెట్ గా నిలవబోతోంది. నోట్లో బీడీ పట్టుకుని మరోవైపు చేతిలో మందు సీసాతో కనిపించిన నాని చొక్కా లుంగి అసలు ఒక పద్ధతిలో లేని గడ్డం జుట్టు ఇలా అన్నీ బోల్డ్ గా ఉన్నాయి. దసరా సినిమా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇక బతుకమ్మ పాటతో మొదలైన సినిమా ట్రైలర్ లో కీర్తి సురేష్ కూడా వెన్నెల పాత్రతో ఎంట్రీ ఇచ్చింది. ధరణిగా పెట్టి పుట్టావురా నా కొడకా.. అంటూ ఆమె పెళ్లికూతురుగా కనిపించిన విధానం హైలెట్ గా నిలిచింది.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీలో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ ముఖ్య పాత్రల్లో నటించారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ‘దసరా’ విడుదలకానుంది.

YouTube video