మరింత ఆలస్యం అవ్వడం తో పవన్ కళ్యాణ్ ర్యాలీ స్పీడ్ ను పెంచిన పోలీసులు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహన స్పీడ్ ను పెంచారు కృష్ణ జిల్లా పోలీసులు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఆటోనగర్ నుండి వారాహి వాహనం నుండి ర్యాలీగా పవన్ కళ్యాణ్ బయలుదేరారు. బయలుదేరిన దగ్గరి నుండి కూడా పవన్ కళ్యాణ్ కార్య కర్తలకు , అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్నారు.

షెడ్యూల్ ప్రకారం రాత్రి 07 గంటల వరకు సభ స్థలానికి పవన్ కళ్యాణ్ చేరుకోవాల్సి ఉంది. కానీ భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు చేరుకోవడం తో ట్రాఫిక్ జాం అవుతుంది. ఎక్కడిక్కడే అభిమానులు రోడ్ల ఫై చేరుకోవడం తో పవన్ చేరుకోవడం ఆలస్యం అవుతుంది. ఈ క్రమంలో కృష్ణ జిల్లా పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తూ వారాహి ని స్పీడ్ గా ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ సభ స్థలానికి చేరుకోవడానికి మరో గంటకు పైగానే సమయం పట్టవచ్చని తెలుస్తుంది.