యూపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

cm-yogi-adityanath
cm-yogi-adityanath

లక్నో: సీఎం  యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శాంతిభద్రతలను మరింత పటిష్ఠం చేయడానికి పోలీస్ కమిషనర్ వ్యవస్థ తీసుకువస్తున్నట్టు ప్రకటించింది. శనివారం జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకుంది. లక్నో, గౌతమ్ బుద్ధ నగర్‌(నోయిడా)లకు పోలీస్ కమిషనర్‌లను నియమిస్తున్నట్టు సోమవారం జరిగిన మీడియా సమావేశంలో సీఎం యోగి చెప్పారు. అంతేగాక రాజధాని లక్నోలో పోలీస్ స్టేషన్ల సంఖ్యను కూడా పెంచతున్నట్టు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఈ నేపథ్యంలో లక్నోకి ఎస్ఎన్ సబత్ తొలి పోలీస్ కమిషనర్‌గా నియమితులు కానున్నారు. అదేవిధంగా గౌతమ్ బుద్ధ నగర్‌ సీపీ రేసులో అలోక్ కుమార్, ప్రశాంత్ కుమార్‌ ఉన్నారు.

లక్నో, గౌతమ్ బుద్ధ నగర్‌ పోలీస్ కమిషనర్ల గురించి రెండు రోజుల క్రితమే రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్ తెలిపారు. కమిషనర్ వ్యవస్థను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు మీడియాకు చెప్పారు. కమిషనర్లుగా సీనియర్ ఐపీఎస్‌లను నియమిస్తామని.. ఐజీ హోదాలో వారు పని చేస్తారన్నారు. కమిషనర్ వ్యవస్థతో శాంతిభద్రతలు మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/