కరీంనగర్ లో ‘దసరా’ సక్సెస్ మీట్ ..

నాని నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దసరా మూవీ సక్సెస్ సంబరాలు కరీంనగర్ లో జరగబోతున్నాయి. నాని , కీర్తి సురేష్ జంటగా నూతన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ ( మార్చి 30 న) పాన్ ఇండియా గా పలు భాషల్లో విడుదలై భారీ విజయం సాధించింది. నాని కెరియర్ లోనే బెస్ట్ గా మూవీ నమోదు కావడమే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద పలు రికార్డ్స్ నమోదు చేస్తుంది.

ఈ తరుణంలో మేకర్స్ ఈ చిత్ర సక్సెస్ సంబరాలను రేపు ‘కరీంనగర్’ లో నిర్వహించబోతున్నారు. నగరంలోని ఎస్.ఆర్.ఆర్. గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకాబోతుంది. ఈ వేడుకలో చిత్ర యూనిట్ అంత పాల్గొననున్నారు.

ఇక ఈ మూవీ నాల్గు రోజుల కలెక్షన్స్ చూస్తే.. దేశవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో కలిపి తొలి రోజు 23.2 కోట్లు, రెండో రోజు 9.75 కోట్లు, మూడో రోజు 12.1 కోట్లు, నాలుగో రోజు 12.6 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. ఇండియాలో సుమారు ఈ చిత్రం 57 కోట్ల వసూళ్లను రాబట్టింది.