శంషాబాద్‍లో అత్యవసరంగా ల్యాండ్ అయిన ఇండిగో విమానం

మంగళవారం శంషాబాద్ విమానాశ్ర‌యంలో ఇండిగో విమానాన్ని అత్యవ‌స‌రంగా ల్యాండింగ్ చేశారు. బెంగుళూరు నుంచి వార‌ణాసి వెళ్తున్న విమానాన్ని దారి మ‌ళ్లించి అత్య‌వ‌స‌రంగా హైద‌రాబాద్‌లో దించారు. 6E897 విమానంలో సాంకేతిక స‌మ‌స్య వ‌చ్చిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ముందుజాగ్ర‌త్త‌గా ఆ విమానాన్ని శంషాబాద్ విమానాశ్ర‌యానికి డైవ‌ర్ట్ చేసిన‌ట్లు ఇండిగో ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

మంగళవారం ఉదయం బెంగళూరు నుండి వారణాసి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపంతో శంషాబాద్ లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. పైలట్లు ఉదయం 6 గంటల 15 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 137 మంది ప్రయాణికులు ఉన్నారు. పైలట్ల జాగ్రత్త ఫ్లైట్ ను ల్యాండ్ చేయడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.