నిలిచిపోయిన ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ప్రయోగాలు

వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ కు అనారోగ్యం

Oxford coronavirus vaccine

లండన్‌: ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ భాగ‌స్వామ్యంతో రూపొందుతున్న ఆస్ట్రాజెనె‌కా వ్యాక్సిన్ చివ‌రి ద‌శ ప్రయోగాలు తాత్కాలింగా నిలిచిపోయాయి. బ్రిటన్ లో టీకా తీసుకున్న వ్యక్తి తీవ్ర అనారోగ్యం బారిన పడటంతో, తుది దిశకు చేరిన క్లినికల్ ట్రయల్స్ ను నిలిపివేశామని, వ్యాక్సిన్ భద్రతపై మరోమారు పూర్తిస్థాయిలో సమీక్షిస్తామని ఆస్ట్రాజెనికా ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, సదరు వాలంటీర్ కు ఎటువంటి అనారోగ్య సమస్య ఏర్పడిందన్న విషయాన్ని మాత్రం సంస్థ పేర్కొనలేదు. ప్ర‌యోగ ప్రామాణిక ప్ర‌క్రియ‌, వ్యాక్సిన్ భ‌ద్ర‌త‌పై పూర్తిస్థాయి స‌మీక్ష కోసం ఈమేర‌కు నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపింది. దీంతో ప‌లు దేశాల్లో జ‌రుగుతున్న ఈ వ్యాక్సిన్ ప్రయోగం నిలిచిపోయింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/