మెగాస్టార్ నుండి ‘మెగా ‘ కౌంటర్ ..

మెగాస్టార్ చిరంజీవి నొప్పి లేకుండా మెగా కౌంటర్ ఇచ్చాడు. చిరంజీవి హీరోగా నటించిన వాల్తేర్ వీరయ్య సంక్రాంతి కానుకగా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది. ఈ మూవీ కి ముందు చేసిన ఆచార్య , గాడ్ ఫాదర్ చిత్రాలు అభిమానులను , ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఆచార్య మూవీ భారీ డిజాస్టర్ కాగా , గాడ్ ఫాదర్ యావరేజ్ అనిపించుకున్న కలెక్షన్లు పెద్దగా వసూళ్లు చేయలేకపోయింది. దీంతో కొంతమంది సినీ విశ్లేషకులు చిరంజీవి పని అయిపోయిందంటూ విమర్శలు చేయడమే కాదు వాల్తేర్ వీరయ్య కు 2 .25 / 5 రేటింగ్ ఇచ్చి షాక్ ఇచ్చారు. కానీ వారి రేటింగ్ కు సినిమా వసూళ్లకు ఏమాత్రం సంబంధం లేకుండా అయిపోయింది.

వాల్తేర్ వీరయ్య మూవీ భారీ విజయం సాధించడమే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద రెండు వందల కోట్ల వైపు పరుగులు పెడుతుంది. ఇక ఓవర్సీస్ లో అయితే ఇప్పటికే రెండు మిలియన్ల క్రాస్ చేసి మూడో మిలియన్ వైపు దూసుకెళ్తుంది. ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూట‌ర్స్ శ్లోక ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ ఫుల్ సేఫ్ జోన్‌లోకి వెళ్లింది. ఈ హ్యాపీ మూమెంట్స్‌ను మేక‌ర్స్‌, డిస్ట్రిబ్యూట‌ర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అందులో భాగంగా యు.ఎస్‌.ఎలో 25 ఏరియాల్లోని 25 థియేట‌ర్స్‌లో 25 షోస్‌ను అభిమానుల కోసం ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శించారు. ఈ షో అనంత‌రం మెగాస్టార్ చిరంజీవి సినిమా చూడ‌టానికి వ‌చ్చిన ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కుల‌తో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించారు.

ఓవ‌ర్ సీస్ ప్రేక్ష‌కుల‌తో మాట్లాడుతున్న స‌మ‌యంలో చిరంజీవి న‌వ్వుతూనే యు.ఎస్‌.ఎ క‌లెక్ష‌న్స్‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. కొంత మంది ‘వాల్తేరు వీరయ్య’కు 2.25 రేటింగ్ ఇచ్చారు. అంటే వారు ముందుగానే క‌లెక్ష‌న్స్‌ను చెప్పారు. కానీ అది మ‌నమే అర్థం చేసుకోలేదని అన్నారు. ఇది స‌ర‌దాగా అన్నాన‌ని, ఎవ‌రినీ ఉద్దేశించి ఈ వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని అన్నారు చిరంజీవి. అయితే నెటిజ‌న్స్ మాత్రం చిరంజీవి న‌వ్వుతూనే ‘వాల్తేరు వీరయ్య’ సినిమాను త‌క్కువ చేసి రాసిన వారికి గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారంటున్నారు.

ఇక వాల్తేర్ వీరయ్య విషయానికి వస్తే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా రవితేజ కీలక పాత్రలో నటించి సినిమా సక్సెస్ లో భాగం అయ్యాడు. రెండో వారంలోను ఈ మూవీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.