దసరా మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్..రికార్డ్స్ బ్రేక్

నాని నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దసరా..బాక్స్ ఆఫీస్ వద్ద ఫస్ట్ డే వసూళ్ల వర్షం కురిపించడమే కాదు మెగా రికార్డ్స్ బ్రేక్ చేసింది. నాని – కీర్తి సురేష్ జంటగా నూతన డైరెక్టర్ శ్రీకాంత్ డైరెక్షన్లో శ్రీరామనవమి సందర్బంగా మార్చి 30 న పాన్ ఇండియా గా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలకు ముందే సాంగ్స్ తో , ట్రైలర్ ఆసక్తి రేపిన దసరా..ఆసక్తి తగ్గట్లే తెరకెక్కడం తో ప్రేక్షకులు బ్రహ్మ రథంపడుతున్నారు. ముఖ్యంగా సినిమా చివరి 20 నిముషాలు ప్రేక్షకులను కట్టిపడేసింది. నాని తన కెరియర్ లోనే బెస్ట్ యాక్టింగ్ ఇచ్చారని చెప్పాలి..తన గెటప్ , యాక్షన్ సన్నివేశాలు ఇలా అన్ని కూడా ఓ రేంజ్ కి తీసుకెళ్లాయి.

ఇక ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే..

నైజాం – రూ. 6.78 కోట్లు
సీడెడ్ – రూ.2.36 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ.1.42 కోట్లు
ఈస్ట్ – రూ.90 లక్షలు
వెస్ట్ – రూ. 55 లక్షలు
గుంటూరు – రూ.1.22 కోట్లు
కృష్ణ – రూ. 64 లక్షలు
నెల్లూరు – రూ.35 లక్షలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.14.22 కోట్లు రాబట్టి ..నైజాంలో 2023లో అత్యధిక షేర్ రాబట్టిన చిత్రంగా రికార్డు సాధించింది. సంక్రాంతికి వచ్చిన బిగ్గెస్ట్ మూవీలు ‘వీర సింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలను కూడా నాని మూవీ వెనక్కి నెట్టేసింది. మొత్తానికి నైజాం గడ్డపై తనదైన మార్కును చూపించి ఎన్నో రికార్డులు క్రియేట్ చేసాడు నాని.