తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్

తెలుగు రాష్ట్రాల్లో మరో వందే భారత్ ట్రైన్ పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది. గుంటూరు మీదుగా సికింద్రాబాద్‌- తిరుపతి మధ్య వందే భారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ పరుగులుపెట్టబోతుంది. ఏప్రిల్ 9న తిరుపతి నుంచి, 10న సికింద్రాబాద్ నుంచి రైలు బయలుదేరనుంది. నిజానికీ రైలును ఏప్రిల్ 8న సికింద్రాబాద్‌లో ప్రారంభిస్తున్నారు. అయితే, ఆ రోజున ప్రయాణికులను అనుమతించరు. సికింద్రాబాద్‌లో ఉదయం 6 గంటలకు రైలు బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. మధ్యలో నల్గొండ (7.19), గుంటూరు జంక్షన్ (9.45), ఒంగోలు (11.09), నెల్లూరు (12.29) స్టేషన్లలో ఆగుతుంది.

తిరుగు ప్రయాణంలో ఈ రైలు మధ్యాహ్నం 3.15 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. నెల్లూరు (5.20), ఒంగోలు (6.30), గుంటూరు జంక్షన్ (7.45), నల్గొండ (8.10) స్టేషన్లలో ఆగుతుంది. రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.