ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ రాజీనామా

ఢిల్లీ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా

Subhash Chopra
Subhash Chopra

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. బిజెపి గెలుపు తమదేనని చివరి వరకు పోరాడిన గతంతో పోలిస్తే మెరుగైన ప్రదర్శన కనబరిచినప్పటికీ అంచనాలకు ఆమడదూరంలో నిలిచింది. ఇకపోతే కాంగ్రెస్‌ పత్తా లేకుండా పోయింది. ఒక్కటంటే ఒక్క స్థానంలోనూ ప్రభావం చూపలేకపోయింది. అంతేకాదు, గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఆ పార్టీకి పోలైన ఓట్లశాతం కూడా గణనీయంగా పడిపోయింది. 2015 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 9.7 శాతం ఓట్లు పోలవగా, ఈసారి అది 4.27 శాతానికి దిగజారింది. దీంతో ఈ ఎన్నికల్లో ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ పార్టీ ఢిల్లీ చీఫ్ సుభాష్ చోప్రా తన పదవికి రాజీనామా చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/