నేటి నుంచి పార్లమెంటు

న్యూఢిల్లీ : నేటి నుండి పార్లమెంటు వర్షకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్రప్రభుత్వం 29 సాధారణ బిల్లులు, రెండు ఆర్థిక బిల్లులను ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నది. ఇందులో మూడు బిల్లులు ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్డినెన్స్‌ల స్థానంలో తీసుకురావడానికి ఉద్దేశించినవి. ‘రక్షణ ఉత్పత్తుల సంస్థల్లో పనిచేస్తున్నవారు నిరసనలు తెలుపకూడదు’ అన్న వివాదాస్పద బిల్లు కూడా ఈ జాబితాలో ఉన్నది. సెన్సార్‌ బోర్డు నిర్ణయాన్ని సమీక్షించేలా కేంద్రానికి అధికారం కల్పించే కొత్త సినిమాటోగ్రఫీ బిల్లును కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/