రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికిన సిఎం జగన్‌

తిరుచానూరుకు పయనమైన రాష్ట్రపతి దంపతులు

jagan-welcomes-ramnath-kovind-at-renigunta-airport

తిరుమల: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దపంతులు తిరుమల పర్యటన నిమిత్తం రేణిగుంట ఎయిర్‌పోరుకు చేరుకున్నారు. ఈనేపథ్యంలో ఆయనకు సిఎం జగన్‌, గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ ఘన స్వాగతం పలికారు. పలువురు మంత్రులు కూడా కోవింద్ కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఆపై ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గాన తిరుచానూరుకు వెళ్లనున్న రాష్ట్రపతి దంపతులు, పద్మావతి అమ్మవారిని దర్శించుకుని, అక్కడి నుంచి మధ్యాహ్నానికి తిరుమలకు వెళ్లనున్నారు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని స్వామివారిని దర్శించుకున్న అనంతరం, సాయంత్రం తిరిగి రేణిగుంట చేరుకుని ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ కు బయలుదేరి వెళ్లనున్నారు.

President Kovind to visit Balaji temple in Tirupati today: AP CM Jagan, AP  Guv gear up for welcome - NewsX


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/