ఏపీలో షర్మిల పార్టీ అంశం ఫై బ్రదర్ అనిల్ కామెంట్స్

తెలంగాణాలో వైఎస్సార్‌టీపీ పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల..ఏపీలో కూడా పార్టీ పెట్టబోతోందా…అనేది ఇప్పుడు చర్చ గా మారింది. రీసెంట్ గా షర్మిల మాట్లాడుతూ ఏపీలో రాజకీయ పార్టీ ఎప్పుడైనా పెట్టవచ్చు… పెట్టకూడదనే రూల్ ఏమీ లేదుకదా? అని వ్యాఖ్యనించారు. ప్రస్తుతం తాను ఒక మార్గాన్ని ఎంచుకున్నాను అని.. అందులో నడుస్తున్నాను అంటూ.. భవిష్యత్తు పై పార్టీ పెట్టే యోచన వుందని పరోక్ష సంకేతాలు అందించారు. ఇదే అంశం ఫై ఆమె భర్త బ్రదర్ అనిల్ ను మీడియా వారు అడిగారు.

ఈరోజు గన్నవరం ఎయిర్ పోర్టుకు బ్రదర్ అనిల్ చేరుకోగా.. ఆయనను మీడియా ఏపీలో షర్మిల పార్టీ ఏర్పాటుపై ప్రశ్నించింది. తాను విజయవాడలో చిన్న ఫంక్షన్ ఉండి వచ్చానని.. తనకు ఇక్కడ ఏమి పని లేదన్నారు. షర్మిల ఏపీలో పార్టీ పెడుతున్నారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘పార్టీకి, నాకు సంబంధం లేదు. నేను పార్టీ గురించి మాట్లాడను’ అని బ్రదర్ అనిల్ సమాధానమిచ్చారు. ఒక వేళ షర్మిల ఏపీలో నిజంగా పార్టీ పెడితే అది అధికార పార్టీకి పెద్ద మైనస్ అయ్యే ప్రమాదం ఉది. వైఎస్ కుటుంబంలో చాలామంది జగన్ కు దూరమయ్యే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా వైఎస్ విజయమ్మ ఎటు ఉంటారు అన్నది ప్రశ్నార్థకంగా మారుతుంది.