ఓ ఇంటివాడైన దగ్గుపాటి అభిరామ్

దగ్గుపాటి సురేష్ బాబు తనయుడు దగ్గుపాటి అభిరామ్ ఓ ఇంటివాడయ్యాడు. అభిరామ్ వరసకు మరదలైన ప్రత్యూష అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. శ్రీలంకలో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌కు బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరలవుతున్నాయి. ఇటీవలే ప్రత్యూషతో అభిరామ్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.

అభిరామ్ ‘అహింస’ అనే మూవీతో టాలీవుడ్‌లో హీరోగా పరిచయమయ్యాడు. కానీ ఈ మూవీ అంత గుర్తింపు తీసుకురాలేదు. దీంతో కొన్నాళ్లు గ్యాప్ తీసి సినిమాలు చేస్తానని ప్రకటించాడు. అతను ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్‌లోనూ నటించడం లేదు. దీంతో పెళ్లి చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు.