బైడెన్‌కు స్కిన్ క్యాన్స‌ర్ చికిత్స‌ విజయం: వైట్ హౌజ్ ప్రకటన

ఛాతిపై చివరి కణతిని తొలగించిన వైద్యులు

us-president-biden-had-skin-cancer-removed-doctor-says-no-more-treatment-needed

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చర్మ క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఆయన ఛాతి దగ్గర ఉన్న చివరి కణతిని కూడా వైద్యులు తొలగించారు. దాంతో, ఆయన క్యాన్సర్ చికిత్స విజయవంతంగా పూర్తయిందని వైట్ హౌజ్ వైద్యుడు కెవిన్ ఓకానర్ ప్రకటించారు. బైడెన్ చర్మంపై ఉన్న క్యాన్సర్ కణజాలం మొత్తాన్ని విజయవంతంగా తొలగించినట్టు తెలిపారు. బైడెన్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. ఇకపై క్యాన్సర్ ట్రీట్ మెంట్ అవసరం లేదని ప్రకటించారు. కాగా, 80 ఏళ్ల బైడెన్ కు గత నెలలో వైట్ హౌజ్ వైద్య బృందం పూర్తి శారీరక పరీక్షలు నిర్వహించింది. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, విధులు నిర్వహించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని ప్రకటించింది.