రేవంత్ ప్రమాణ స్వీకారానికి BRS ఎమ్మెల్సీ లు హాజరు

తెలంగాణ నూతన ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్ర నేతలతో పాటు, ఎమ్మెల్యేలు , కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం హాజరయ్యారు.

ప్రమాణ స్వీకారానికి రావాలని మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆహ్వానాలు అందాయి. అయితే పార్టీ అధిష్టానం మాత్రం పోవాలని ఎవరికి ఆదేశాలు ఇవ్వలేదని తెలుస్తుంది. అయితే, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ మాత్రం హాజరయ్యారు. వీరిద్దరూ హాజరు కావడంపై బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశమైంది. ప్రొటోకాల్ ప్రకారం మాత్రమే వారు వెళ్లినట్లు సమాచారం అందుతుంది.