రేపటి నుంచి ఏపీలో కర్ఫ్యూ సడలింపు

అమరావతి: ఏపీలో రేపటి నుంచి కర్ఫ్యూను సడలించనున్నారు. ఈరోజు వరకూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగనుంది. ఈ రిలాక్సేషన్ సమయాన్ని మరో రెండు గంటల పాటు ఏపీ ప్రభుత్వం పెంచింది. రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ రిలాక్సేషన్ సమయం ఉండబోతోంది. ఏపీలో రేపటి నుంచి ఈ నెల 20 వరకూ కర్ఫ్యూ సడలింపు అమలు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సింఘాల్ కలెక్టర్లు, ఎస్పీలకు ఉత్తర్వులు జారీ చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/