మహిళలపై సౌదీ అరేబియా కీలక నిర్ణయం
మహిళలు ఇకపై ఇష్టం వచ్చిన చోట జీవించే హక్కును కల్పించిన సౌదీ
Saudi women allowed to live alone without permission from male guardian
రియాద్: సౌదీ అరేబియాలో ప్రభుత్వం మహిళలపై తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లికాని అమ్మాయిలు, విడాకులు తీసుకున్న, భర్త చనిపోయిన మహిళలకు స్వేచ్ఛను కల్పించింది. ఇకపై వారు తండ్రి లేదా ఇతర పురుష సంరక్షకుడి అనుమతి లేకుండానే వేరుగా ఒంటరిగా జీవించవచ్చు. అంటే ఇకపై ఒంటరి మహిళలు పురుషుల తోడు లేకుండానే ఉండొచ్చు. దేశంలో మహిళలకు ఈ స్వేచ్ఛను కల్పిస్తూ సౌదీ ఇటీవల ఒక చట్టపరమైన సవరణను తీసుకొచ్చింది. ఈ మేరకు న్యాయ అధికారులు ఆర్టికల్ నంబరు 169లోని లా ప్రొసీజర్ బిఫోర్ షరియా కోర్టు పేరా-బీను కొట్టేశారు.
దీంతో పెళ్లికాని, విడాకులు తీసుకున్న, భర్తను కోల్పోయిన మహిళలు పురుషుల సంరక్షణలోనే ఉండాలన్న నిబంధన రద్దయింది. మహిళలు ఇకపై తమకు ఇష్టం వచ్చిన చోట జీవించే హక్కును కలిగి ఉంటారు. ఒంటరిగా ఉండాలని నిర్ణయం తీసుకున్న మహిళలకు వ్యతిరేకంగా ఇకపై వారి కుటుంబ సభ్యులు న్యాయస్థానంలో దావా వేయడానికి వీల్లేదు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/