కీరా తొక్కలతో పసందైన రైతా
రుచి: న్యూ వెరైటీ వంటకాలు

కావాల్సిన పదార్ధాలు:
పెరుగు-పెద్ద కప్పు, కీరా తొక్కలు -5,6, కొత్తిమీర తరుగు- రెండు పెద్ద చెంచాలు, వెల్లుల్లి రెబ్బలు- 2, పచ్చి మిర్చి- 4, ఉప్పు -తగినంత
తయారు చేసే విధానం:
చిన్న మిక్సీ జార్ లో కీరా తొక్కలు, పచ్చి మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, రెండు చెంచాల పెరుగు, చిటికెడు ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి… ఈ మిశ్రమాన్ని మొత్తం పెరుగులో వేసి ఉప్పు, కొత్తిమీర జత చేసి బాగా కలపాలి.. టేస్టీ కీరా తొక్కల రైతా రెడీ.. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ట్రై చేయండి..
తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/category/telangana/