క్రూడ్‌ ఆయిల్‌ ధరలను నియంత్రించాలి

అంతర్జాతీయ మార్కెట్‌

Crude oil prices
Crude oil prices

ప్రజాప్రభుత్వం అంటే త్యాగాలు ప్రజలవి, లాభాలు ప్రభుత్వానివి అని అర్థం చేసుకోవాలేమో! దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల వ్యవహారం చూస్తే అలానే అనిపిస్తుంది.

వినియోగదారుడు కొనుక్కొనే పెట్రోలు, డీజిల్‌ ధరల్ని అంతర్జాతీయ మార్కెట్‌కి అనుసంధానం చేసేశారు ఏళ్లకిందటనే.

15 రోజులకోమారు రేట్లు మారే విధానం బదులుగా ప్రతీరోజూ సవరించే విధానం డైనమిక్‌ ప్రైసింగ్‌ పేరుతో 2017లో తీసుకు వచ్చారు.

2014 నుండి నేటి వరకూ 11సార్లు పెట్రో ధరలు పెరగ్గా, రెండుసార్లు మాత్రమే తగ్గాయి. అంతర్జాతీయంగా పెరిగిన ప్రతిసారీ ఇక్కడ వినియోగదారుడికి పెరుగుతున్నాయి. కానీ తగ్గిన ప్రతిసారి మాత్రం తగ్గడం లేదు. ఈసారి మరీ ఘోరం.

వివిధ కారణాలతో క్రూడ్‌ ఆయిల్‌ ధర 50శాతానికి పడిపోయింది. బారెల్‌ ధర 63 డాలర్ల నుండి ఎకాయెకి 33 డాలర్లయింది. ప్రభుత్వం తన మాట ప్రకారం జోక్యం చేసుకోకుండా వ్ఞంటే కనీసం పెట్రోల్‌ ధర గణనీయంగా తగ్గి సామాన్యుడికి ఊరట దక్కేది. కానీ ప్రజాప్రభుత్వం అలా ఎందుకు చేస్తుంది? చక్కగా లీటరు పెట్రోల్‌పై మూడు రూపాయల పన్ను అదనంగా వడ్డించింది.

గత ఎనిమిదేళ్లలో వడ్డించిన పన్నుల్లోరికార్డిది. వెరసి మళ్లీ ప్రజలు అదే పాత రేటుకి ఇంధనం కొనుక్కోవాలి. అంటే అంతర్జాతీయ మార్కెట్‌ బట్టే ఇంధనం ధర ఉంటుందని చెప్తూనే అక్కడ యాభై శాతం తగ్గితే ఇక్కడ ఏడు శాతం మాత్రమే తగ్గిస్తున్నారు.

అదే అక్కడ పెరిగుంటే మాత్రం డైరెక్ట్‌గా ఇక్కడా పెంచేసేవారు శషబిషలులేకుండా. పెట్రోల్‌ అసలు ధరకన్నా దానిపై పన్నులే ఎక్కువైన ఈ నిలువ్ఞదోపిడీ మారాలి.

జిఎస్టీ పరిధిలోకి ఇంధనం ధరల్ని తీసుకురావడమే కాకుండా ధరల్లో వెసులుబాటుని నేరుగా ప్రజలకు అందించాలి. ఇప్పుడలా చేసి వ్ఞంటే ప్రజలకు కష్టకాలంలో ఊరట ఉండేది.

  • డా.డి.వి.జి.శంకరరావు

తాజా ‘చెలి’ శీర్షికల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/women/