కఠిన నియంత్రణకు ప్రజల మద్దతు అవసరం

ఆరోగ్య నిపుణుల సూచన

public support
public support

కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న చైనా దేశంలో ఇంత సత్వరంగా మార్పులు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.అయితే కరోనా వైరస్‌ నియంత్రించేందుకు చైనా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం వల్ల కరోనా వైరస్‌ నియంత్రణ సాధ్యమైందని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.

ప్రస్తుతం చైనాలో ఉన్న పరిస్థితులను బట్టి కరోనా వైరస్‌ ప్రభావంపై ఎంతటి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిందో అర్థం చేసుకోవచ్చు. అయితే కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపింది చైనాప్రభుత్వం ప్రజలెవరూ సమూహాలుగా తిరగకుండా నిర్వహించాలంటూ ఆదే శించింది.

దీనికోసం కేవలం ప్రకటనలు విడుదల చేసి ఊరుకోకుండా పర్ఫెక్ట్‌ యాక్షన్‌ ప్లాన్‌ రెడీ చేసి ఆచరణలో పెట్టడంతో రోడ్ల మీద జనసంచారం తగ్గి, చైనాలో రోజురోజుకు కరోనా వైరస్‌ కట్టడి అయింది.ఇక మీడియా సోషల్‌ మీడియాపై కూడా నియంత్రణ వేసింది చైనా ప్రభుత్వం.

అంతేకాకుండా ఆరు రోజుల్లోనే వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మించడం లాంటి సాహసోపేతమైన చర్యలు చేపట్టడం వల్ల చైనా దేశం కరోనా కట్టడికి తీసుకున్న భద్రతా చర్యలు తీసుకోవాలని, కరోనా ప్రభావం కట్టడి చేయాలని నిపుణులు కోరుతున్నారు.

మనదేశంలో కరోనా వ్యాప్తి ఇప్పుడు రెండోదశలో ఉందని, వైరస్‌ వ్యాప్తి మూడో దశలోకి (సామాజిక వ్యాప్తి లేదా కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌) ప్రవే శించడాన్ని ఆపడానికి భారతదేశానికి ఉన్న గడువ్ఞ కేవలం 30 రోజులే నని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడి కల్‌ రీసెర్చ్‌ డిజి డాక్టర్‌ బలరాం భార్గవ హెచ్చరిక చేశారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ వ్యాపిం చడంలో ఉన్న దశలేమిటి? ఏ దశలో వైరస్‌ను ఎలా నియం త్రించవచ్చు?అనే అంశాలను పరిశీలించాలి.

మొదటి దశ ఏమిటి? చైనా, ఇటలీ, ఇరాన్‌ తదితర దేశాలకు వెళ్లొచ్చిన వారికి మాత్రమే వైరస్‌ పాజిటివ్‌గా వస్తుంది. ఉదాహరణకు తొలి ముగ్గురు కరోనా బాధితులు చైనాలో వైద్యవిద్య అభ్యసిస్తున్న కేరళవాసులు. అక్కడి నుంచి వచ్చాక వారికి వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది. అలాగే హైదరా బాదీ కూడా దుబా§్‌ులో ఆ వైరస్‌ బారినపడి ఇక్కడికి వచ్చారు.

తొలి దశలో బయటపడ్డ కేసులన్నీ ఇలాంటివే. దీన్ని తొలి దశగా చెప్పవచ్చు. రెండో దశలో ఏమి జరుగుతుంది. విదేశాలకు వెళ్లి కరోనా బారినపడి మనదేశానికి వచ్చినవారి కుటుంబసభ్యులు, సహోద్యోగులకు వైరస్‌సోకే దశ ఇది. దేశంలో ప్రస్తుతం ఈ దశ నడుస్తోంది. ఈ దశను లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌గా వ్యవహరిస్తారు.

మూడో దశ ఏమిటంటే? ఇది అత్యంత కీలకమైనది. ప్రమాద కరమైన దశ. రెండో దశలో వైరస్‌ బారినపడిన వారి నుంచి చుట్టుపక్కల వారికి వైరస్‌ పెద్దఎత్తున వ్యాపిస్తుంది. చూస్తూ చూస్తుండగానే వైరస్‌ వేలాది మందికిసోకుతుంది.మరణాల సంఖ్య భారీగా పెరగడం మొదలవ్ఞతుంది. నాలుగో దశ ఏమిటంటే వైరస్‌ నియంత్రణ చెయ్యి దాటిపోయే దశ. ఇప్పుడు ఇటలీ, ఇరాన్‌ ఈ దశలోనే ఉన్నాయి. ఈదశను తొలిసారి చూసిన దేశం చైనా.

ఈ దశలోనే అక్కడ కేసుల సంఖ్య ఎనభైవేలకు చేరింది. ఆలస్యంగా మేలుకున్నా కఠినంగా కట్టడి చర్యలు తీసుకోవడంతో ఆ దేశంలో తగ్గుముఖం పట్టింది. ఇటలీ, ఇరాన్‌ వంటి దేశాలు మాత్రం అల్లా డిపోతున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి మూడు, నాలుగు దశల్లోకి ప్రవేశిస్తే ఆరోగ్యవ్యవస్థలు కుప్పకూలిపోతాయి.అందుబాటులో ఉన్న వైద్యులు, వైద్యసిబ్బంది సరిపోరు.ఐసోలేషన్‌ వార్డులు, క్వారంటైన్లు నిండిపోతాయి.

రోజూ వందలు, వేల సంఖ్యలో కొత్తగా వైరస్‌ బారిన పడుతుంటారు. చైనాలో అలాంటి స్థితిలోనే పదిరోజుల్లో వెయ్యిపడకల ఆస్పత్రి 1500 పడకల ఆస్పత్రి నిర్మిం చారు. పెద్దపెద్ద హోటళ్లను, ఇతరత్రా నిర్మాణాలను తాత్కాలిక ఆస్పత్రలుగా మార్చేశారు. చైనాలో బలమైన ప్రభుత్వం ఉండడం వల్ల అది సాధ్యమైంది కానీ, మనలాంటి దేశాల్లో అది సాధ్యమవ్ఞతుందా అనేది సందేహమే. అభివృద్ధిచెందిన దేశంగా పేరొందిన ఇటలీ వల్ల కూడా కావట్లేదు.

రోగులకు చికిత్స చేయ డానికి సరిపడా ఆస్పత్రులు సరిపోక ఎనభైఏళ్లు దాటిన వారిని చేర్చుకోకూడదనే దారుణమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలో ఇటలీ సర్కారు పడింది.అలాంటి పరిస్థితి మనదేశంలో రాకూడద నుకంటే అందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగాకృషి చేయాలి.

ప్రభుత్వాలు ప్రస్తుతం అదే పనిలో ఉన్నాయి.కానీ అది సరిపోదని ప్రజల్లో కూడా అవగాహన ఉండాలని వైద్య నిపుణులు చెబుతు న్నారు.

వారు ప్రజలకు చేస్తున్న సూచనలేమిటంటే ప్రభుత్వం బడులకు సెలవ్ఞలు ఇచ్చింది కదా అని ప్రయాణాలు పెట్టుకోవద్దు. కరోనాబారిన పడ్డ హైదరాబాద్‌ వాసి బెంగళూరు నుంచి బస్సు లోనే ప్రయాణించిన సంగతి గుర్తుపెట్టుకోవాలి.

అత్యవసరమైతే తప్పబయటకు వెళ్లొద్దు.వీలైనంత వరకుఇళ్లల్లోనే ఉండాలి.జలుబు, దగ్గు,జ్వరం వంటివాటితో బాధపడేవారంతా తప్ప బయటకు వెళ్లొద్దు.జలుబు,దగ్గు, జ్వరం వంటివాటితో బాధపడేవారంతా అది కరోనానే అని భయపడాల్సిన పన్లేదు.

కానీ అలాంటివారు తాము స్వయంగా ఇటీవలికాలంలో విదేశాలకు వెళ్లొచ్చినా, విదేశాలకు వెళ్లొచ్చినవారికి దగ్గరగా మెలిగినా అనుమానించాల్సిందే. వెంటనే ఆస్పత్రికి వెళ్లాల్సిందే.

ఒకవేళ వారికి వైద్యపరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినా, ముందుజాగ్రత్త చర్యగా కనీసం పధ్నాలుగు రోజులపాటు స్వీయ గృహనిర్బంధంలో ఉండడం మంచిది.

వెంటనే ఆస్పత్రికి వెళ్లాల్సిందే. ఒకవేళ వారికి వైద్యపరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినా, ముందుజాగ్రత్త చర్యగా కనీసం పధ్నాలుగు రోజులపాటు స్వీయ గృహనిర్బంధంలో ఉండడం మంచిది.

వీలైతే కుటుంబ సభ్యులను కూడా తాకకుండా ఒక గదికి పరిమితంకావాలి. ఎందు కంటే వైరస్‌ సోకిన పధ్నాలుగు రోజుల దాకా కొందరిలో లక్షణాలు బయటపడవ్ఞ. పరీక్షల్లో నెగెటివ్‌ వస్తుంది.

ఆ భరోసాతో వారు బయటకు తిరిగి మరింత మందికి అంటిస్తారు. చైనా, ఇటలీల్లో ఇలాంటి తప్పుడు నెగెటివ్‌ బాధితుల వల్లే వైరస్‌ విస్తృతంగా వ్యాపించింది.

చేతులు తరుచుగా శుభ్రం చేసుకోవడం, హ్యాండ్‌ శానిటైజర్ల వంటివి వాడటం వంటివి ముందు నుంచీ అందరూ చెబుతున్నవే. దశలతో సంబంధం లేకుండా అందరూ కచ్చితంగా పాటించాల్సిన నియమాలు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న చైనా దేశంలో ఇంత సత్వరంగా మార్పులు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అయితే కరోనా వైరస్‌ నియంత్రించేందుకు చైనా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం వల్ల కరోనా వైరస్‌ నియంత్రణ సాధ్యమైందని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నా రు. ప్రస్తుతం చైనాలో ఉన్న పరిస్థితులను బట్టి కరోనా వైరస్‌ ప్రభావంపై ఎంతటి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిందో అర్థం చేసుకోవచ్చు.

అది కూడా ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న చైనాలో కరోనా వైరస్‌ విజృంభిస్తూ విధ్వంసం సృష్టిస్తున్న సమ యంలో ఇంత తక్కువ కాలంలో కరోనా వైరస్‌ను జయించడం అనేది అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

అయితే కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపింది చైనాప్రభుత్వం ప్రజలెవరూ సమూహాలుగా తిరగకుండా నిర్వహించాలంటూ ఆదే శించింది.

దీనికోసం కేవలం ప్రకటనలు విడుదల చేసి ఊరుకోకుం డా పర్ఫెక్ట్‌ యాక్షన్‌ ప్లాన్‌ రెడీ చేసి ఆచరణలో పెట్టడంతో రోడ్ల మీద జనసంచారం తగ్గి, చైనాలో రోజురోజుకు కరోనా వైరస్‌ కట్టడి అయింది.

ఇక మీడియా సోషల్‌ మీడియాపై కూడా నియం త్రణ వేసింది చైనా ప్రభుత్వం. అంతేకాకుండా ఆరు రోజుల్లోనే వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మించడం లాంటి సాహసోపేతమైన చర్యలు చేపట్టడం వల్ల చైనా దేశం కరోనా కట్టడికి తీసుకున్న భద్రతా చర్యలు తీసుకోవాలని, కరోనా ప్రభావం కట్టడి చేయాలని నిపుణులు కోరుతున్నారు.

మనదేశంలో దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి పిలుపు మేరకు ఒక్కరోజు జనతా కర్ఫ్యూ విధించారు.ప్రజారవాణా వ్యవస్థను ఆపేశారు.

ఈ దిశలో ప్రజలందరూ స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించి ప్రభుత్వానికి సహకరించినట్టుగా మిగిలిన ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యలకు సహకరించాలి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సరిహద్దులను బంద్‌చేశాయి. కరోనా కేసులు నమోదైన 75 జిల్లాల్లో పూర్తిగా నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ ప్రక టించారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సహకరించాలి.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఇప్పటివరకూ దేశవ్యా ప్తంగా పన్నెండు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ప్రకటించారు.

రవాణా వ్యవస్థ స్తంభించబోతున్న ఈ తరుణంలో పాలు,కూరగాయలు, నిత్యాస వర వస్తువ్ఞలు దొరకని స్థితి రాబోతుందని, కావ్ఞన వాటి ధరలు పెరగకుండా నిత్యాసవర సరకుల రవాణా, పంపిణీ సక్రమంగా అమలు చేయాలి. ప్రజలకు అందుబాటులో అన్ని వ్యవస్థలు ఉండాలి.

ఇప్పటికే పది మంది మించి ప్రజలు గుమికూడి ఉండరాదని ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.

ప్రజాజీవనం అస్తవ్యస్తం కాకుండా తగు చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలని అన్ని వర్గాలు కోరుతున్నాయి. ఆ దిశగా అడుగులు వేస్తూ ప్రభు త్వాలు ముందుకు పోవాలని కరోనాను కట్టడి చేయాలి. ్ద

  • వాసిలి సురేష్‌

తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/devotional/