షట్‌డౌన్‌ చేసే ప్రసక్తే లేదు

కొన్ని ప్రాంతాలను క్వారంటైన్‌ చేద్దాం.. ట్రంప్‌

donald trump
donald trump

నూయార్క్‌: ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌ ఆర్ధిక వ్యవస్థ కలిగిన అమెరికా నే షట్‌డౌన్‌ చేసే ప్రసక్తే లేదని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. అమెరికాలో ఇప్పటికే కరోనా బారిన పడి 550 మంది చనిపోయారు, దీనితో ముందు జాగ్రత్త పరంగా అమెరికాను షట్‌డౌన్‌ చేయాలని అక్కడి వైద్యులు సూచించగా.. షట్‌డౌన్‌ చేస్తే అసలుకన్నా ఇతర సమస్యలు పెరుగుతాయన్నారు. అమెరికాలో కరోనా ఇంకా పూర్తిగా వ్యాపించలేదని కొన్ని ప్రాంతాలకే విస్తరించిందని, అవసరమయితే వాటిని క్వారంటైన్‌ చేద్దామని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/