సంక్షోభాల వలయంలో కాంగ్రెస్‌!

సుదీర్ఘ చరిత్రగల పార్టీలో ఆదినుంచి అంతర్గత కుమ్ములాటలు

Congress party leaders -File pic
Congress party leaders -File pic

జాతీయ కాంగ్రెస్‌ పార్టీలో తాజా కలకలం ఇప్పుడు కొత్తేమీకాదు. 135 ఏళ్ల ఆ పార్టీ చరిత్రలో అంతర్గత కుమ్ములాటలు, నాయకత్వ సంక్షోభాలు వంటివి ఎన్నో ఉన్నాయి.

నెహ్రూ నుంచి పివి నరసింహారావ్ఞ వరకు ఎంతో మందికి అసంతృప్తి జ్వాలలు ఎదు రయ్యాయి. సమసిపోయాయి.

కానీ అన్ని సంక్షోభాలు వేరు. ఇప్పటి సంక్షోభం వేరు. దేశంలో ప్రధాని నరేంద్రమోడీ మార్గదర్శకత్వంలోని భారతీయ జనతాపార్టీ అన్ని హంగులతో బలీయమైన స్థాయిలో ఉంది.

మోడీ-షాల వ్యూహా లకు ఎవరూ ఎదురొడ్డి నిలబడలేని పరిస్థితి ఉంది.

బిజెపికి పోటీ ఇవ్వలేక ప్రతిసారీ చతికిలపడుతున్న కాంగ్రెస్‌పార్టీకి తాజాసంక్షోభం నిరాశ కలిగించే విధంగానే ఉందని చెప్పవచ్చు.

అయితే కేంద్రంలో నాలుగు దశాబ్దాలకుపైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పార్టీకి అంత ర్గత కలహాలు కొత్తకాదు.

పరిస్థితి విషమించి పార్టీ నిట్టనిలువ్ఞనా చీలిపోయిన సందర్భాలూ ఉన్నాయి.

సోనియాగాంధీ అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు 1999 లోక్‌సభ ఎన్నికలకు ముందు శరద్‌ పవార్‌, పిఎ సంగ్మా, తారిఖ్‌ అన్వర్‌ తిరుగుబాటు చేశారు. వారిని పార్టీనుంచి తొలగించారు.

2001లో కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి కోసం సోనియాపై పోటీకి దిగారు అప్పటి సీనియర్‌ నేత జితేంద్ర ప్రసాద.ఈ సమయంలో పార్టీ సోనియాను ఆదరించింది.

1998లో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సీతారామ్‌ కేసరిపై కొందరు తిరుగుబాటు బావ్ఞటా ఎగురవేశారు.

పివి నరసింహారావుకు వ్యతిరేకంగా 1990లో మరోసారి పార్టీలో అసమ్మతి బయటపడింది.

గాంధీయేతర నాయకుడైన మాజీ ప్రధాన మంత్రి పివి నరసింహారావుపై కొంత మంది నాయకులు తిరుగుబాటు చేశారు.

ఫలితంగా ఎన్‌డి తివారి, అర్జున్‌ సింగ్‌, కాంగ్రెస్‌ నుంచి విడిపోయి కొత్త పార్టీ పెట్టారు. ఇలాంటి సంక్షోభమే రాజీవ్‌ గాంధీ కాలంలోనూ ఎదురైంది.

1987లో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడూ ఆయన కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా, ఆ తర్వాత రక్షణశాఖ మంత్రిగా వ్యవహరించిన విపి సింగ్‌ ప్రభుత్వంలోని అవినీతిపై గళం విప్పారు.

ఆ పరిణామంతో విపి సింగ్‌ను తొలుత మంత్రి పదవి నుంచి, ఆ తర్వాత పార్టీ నుంచి తొలగించారు.

కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చిన విపి సింగ్‌ కొంత మంది కాంగ్రెస్‌ అసంతృప్తినాయకులతో కలిసి జన్‌మోర్చా పార్టీని ప్రారంభించారు.

1969లో రాష్ట్రపతి ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి అయిన వీవీ గిరికి ఇందిరాగాంధీ మద్దతు తెలిపారు. అప్పుడు పార్టీ అధ్యక్షుడిగా నిజలింగప్ప ఉన్నారు.

ఇందిరా చర్యలతో పార్టీలోని సీనియర్‌ నేతలు ఆమెపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఫలితంగా కాంగ్రెస్‌ పార్టీ అధికారిక అభ్యర్థి నీలం సంజీవరెడ్డి ఓడిపోయారు. ఈ పరిణామాలతో అప్పటి కాంగ్రెస్‌ పీఠంపై ఉన్న ఎస్‌ నిజలింగప్ప, ఇందిరాగాంధీని పార్టీ నుంచి బహిష్కరించారు.

తర్వాత పార్టీ రెండుగా చీలిపోయింది. ఆ తర్వాత అనేక పరిణామాలు జరిగాయి. దేశంలో ఎమర్జెన్సీ విధించిన తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పరాజయాన్ని చవి చూసింది.

దీంతో మరోసారి పార్టీలో సంక్షోభం తలెత్తింది. అప్పటి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడైన కె.బ్రహ్మానందరెడ్డి, మరో నేత వైబి చవాన్‌ ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు.

1977 ఎన్నికల ముందు పార్టీలో చీలికలు ఏర్పడిన తర్వాత జగ్జీవన్‌ రామ్‌, హెచ్‌ఎన్‌ బహుగుణతో కలిసి కాంగ్రెస్‌ ఫర్‌ డెమొక్రసీ పార్టీని స్థాపించారు. ఇలాంటి పరిణామాలే నెహ్రూ హయాం లోనూ ఉన్నాయి.

పురుషోత్తమ్‌ దాస్‌ టాండన్‌, కెఎమ్‌ మున్షి, నర్‌హర్‌ విష్ణు గాడ్గిల్‌ వంటి నాయకులతో జవహర్‌లాల్‌నెహ్రూ సమస్యలను ఎదుర్కొన్నారు.

1950లో జరిగిన ఎఐసిసి సమావేశం లో పార్టీకి అధ్యక్షుడిగా పోటీచేయాలన్న తన నిర్ణయాన్ని టాండన్‌ ప్రకటించారు.దేశానికి స్వాతంత్య్రం వచ్చినతర్వాత జరిగిన మొదటి ఎన్నికలు అవి.

1951 జులైలో సిడబ్ల్యూసికి నెహ్రూ రాజీనామా చేసినప్పుడు మళ్లీ సంక్షోభం తలెత్తింది.

మొదటి సార్వత్రిక ఎన్ని కలు జరిగిన ఏడాది తర్వాత టాండన్‌ రాజీనామా చేశారు. అదే ఏడాది అక్టోబరులో ఢిల్లీ వేదికగా జరిగిన ఎఐసిసి సమావేశంలో నెహ్రూ కాంగ్రెస్‌పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

నెహ్రూ కాలం నుంచి పివి నరసింహారావు హయాం వరకూ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నో సంక్షోభాలను చూసింది. ఎంతోమంది కీలక నేతలు సొంతకుంపటి పెట్టుకుని వెళ్లిపోయారు.

అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పేరుతో ప్రాంతీ య పార్టీలు వెలిశాయి. ఆయా పార్టీలు సైతం వారి రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చారు.

ఇన్ని జరిగినా జాతీయ కాంగ్రెస్‌ పార్టీ తట్టుకుని నిలబడింది. ఆ తరువాత దేశాన్ని పాలించింది. కానీ అన్ని సంక్షోభాలు వేరు. ఇప్పటి సంక్షోభం వేరు.

అధికారంలో ఉన్న మోడీ-షాలు కలిసి సామ,దాన భేద దండోపాయాలు ఉప యోగించి ఇతర పక్షాలను చీల్చేస్తున్నారు.

తమలో కలుపుకుంటు న్నారు. దీనికితోడు కాంగ్రెస్‌పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. లోక్‌సభ ఎన్నికల్లో కనీసం పది శాతం సీట్లను కూడా తెచ్చుకోలేక పోతోంది.

వరుసగా రెండోసారి కూడా అధికారానికి దూరమైంది. చిత్తుగా ఓడిపోతోంది.

ఈ నేపథ్యంలో దేశానికి ఒక బలమైన ప్రతిపక్షంకూడా అవసరమే అని భావించేవారికి నిరాశే కలుగు తోంది.

తాజా సంక్షోభం తాత్కాలికంగా సమసిపోయినట్టు ఆ పార్టీ ప్రకటించినా ఈ సమస్య నుంచి విజయవంతంగా కాంగ్రెస్‌పార్టీని సోనియా గాంధీ ఎలా గట్టెక్కిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

  • శ్రీనివాస్‌ గౌడ్‌ముద్దం

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/