ప్రజావాక్కు : సమస్యలపై గళం

Voice of the People
Voice of the People

సామాజిక పింఛన్లు తొలగించవద్దు: యర్రమోతుధర్మరాజు, ధవళేశ్వరం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక పెన్షన్లు ప్రారంభమైనప్పటి డెబ్భైఅయిదు రూపాయల నుండి నవ్యాంధ్రప్రదేశ్‌లో గత నెల రెండువేల రెండువందల యాభై రూపాయలు తీసుకునే వరకు కూడా క్రమంతప్పకుండా పెన్షన్‌ తీసుకున్నటువంటి వృద్ధాప్య, వితంతు, వికలాంగులు ప్రస్తుతం రేషన్‌, ఆధార్‌ కార్డులో తేడా ఉందని సాంకేతిక కారణాల వంకతో తొలగించడంతో దిక్కుతోచని స్థితిలోవారు విలవిల్లాడుతున్నారు. పండుటాకు లు,నా అనే వారులేని నిర్భా´గ్యులు, మంచానికి అతుక్కుపోయి రోగాల బారినపడి, గూడులేక, నిలువలేక, నడవలేని దయ నీయస్థితిలో ఉన్న వారిపై జగన్‌ ప్రభుత్వం పెన్షన్‌ రద్దు చేయ డంసరికాదు.కొత్తగా మంజూరుచేసేవారికి ప్రస్తుత నిబంధనలు అమలు చేసి ఎప్పటి నుండో తీసుకునే వారికి యధాతథంగా చెల్లించి వారికి మానసికధైర్యం నింపాలి.

పదోన్నతులు కల్పించాలి: -జి.వి.రత్నం, నెల్లూరు జిల్లా

ప్రధానోపాధ్యాయులు, స్కూలు అసిస్టెంట్ల పోస్టులకు నెలవారి పదోన్నతులు జరపాలని పది సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అధికారులు దీనిని అమలు చేయడం పూర్తిగా విస్మరించారు.సకాలంలోపదోన్నతులు జరపకపోవడం వలన పదోన్నతిలో నష్టపోయామని కొందరు ఎటిటిలు కోర్టు ను ఆశ్రయించారు.సంబంధిత జిఒలనుపరిశీలించిన కోర్టు వారి కి పదోన్నతులు కల్పించాలని,నెలవారిప్రమోషన్లు క్రమం తప్ప కుండా అమలుజరపాలని తీర్పు ఇచ్చింది. ఫలితంగా 2019 ఆగస్టులో ప్రతినెల ఐదోవ తేదీ లోపల ప్రమోషన్స్‌ జరపాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు విద్యా కమిషనర్‌ ఉత్తర్వులు ఇచ్చారు.ఫలితంగా ఏడునెలలవ్యవధిలో కేవలంరెండువిడతలు మాత్రమే నెలవారీ పదోన్నతులు ఇచ్చారు. పదోన్నతులు జర పకపోవడం వల్ల సీనియర్‌ ఉపాధ్యాయులు నష్టపోతున్నారు.

మహిళా హక్కులను పరిరక్షించాలి:-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

నేటితరం మహిళలు ఉన్నత చదువ్ఞలతో మందుకు వెళ్తున్నా రు. కాని వారిపై అత్యాచారాలు మాత్రం తగ్గడం లేదు. లింగ వివక్షపైనా, దాని నిరోధక చట్టాలపైనా యుక్తవయస్సు నుండే పిల్లల్లో అవగాహన పెంచాలి. మహిళలు తాము పనిచేసే కార్యాలయాల లో,ఇళ్లల్లోకూడా వేధింపులకు గురవ్ఞతున్నారు. బాల్యంనుండి ఆడపిల్లలకు స్వేచ్ఛ, సమాన అవకాశాలు కల్పిం చడం, వాటిని వారు ఎలాంటి బెరుకులేకుండా ఉపయోగిం చుకునేలా చూడడం ఎంతో ముఖ్యం.

అధికారుల బాధ్యతారాహిత్యం: -సి.హెచ్‌.ప్రతాప్‌, శ్రీకాకుళం

రాజస్థాన్‌లోని కోటనగరంలో ఉన్న జికెలోన్‌ ప్రభుత్వ ఆస్పత్రి లో నెలరోజుల వ్యవధిలో న్యూమోనియా మొదలుకొని విషజ్వ రాలవరకూఅనేక కారణాలతో వందమంది శిశువ్ఞలు మరణించా రన్న వార్త దిగ్భ్రాంతి కలిగిస్తుంది. కోట నుంచి గెలుపొందిన లోక్‌సభ స్పీకర్‌ ఈ మరణాలపై చేసిన ట్విట్‌ చూశాక మాత్రమే ముఖ్యమంత్రి స్పందించి ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను తొల గించి దాని పర్యవేక్షణ బాధ్యతల్ని వైద్యవిద్యాశాఖ కార్యదర్శికి అప్పగించడం నిస్సందేహంగా బాధ్యతారాహిత్యం అని చెప్ప కతప్పదు. అంతకుమించి ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకో లేదని తర్వాత సంభవించిన మరణాల వలన తెలుస్తోంది. ఈ దుర్ఘటనపై బాధ్యులైన వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలన్న విపక్షాల డిమాండును ప్రభుత్వం నిర్విద్వందంగా తోసిపుచ్చడం ప్రభుత్వంతనబాధ్యతలపట్లఎంతనిర్లక్ష్యంగాఉంది చెబుతున్నది.

ప్రేక్షకులపై ఆర్థికభారం:-ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

కొత్తగా రిలీజైన సినిమాలకు టిక్కెట్టు ధరలు రెండింతలుగా పెంచేసి సినిమా థియేటర్ల యాజమాన్యాలు ప్రేక్షకులపై తీవ్ర ఆర్థికభారం మోపుతున్నారు. అందుకు కారణం విపరీతంగా పెరుగుతున్న బడ్జెట్‌ అని సినిమా నిర్మాతలు చెబుతున్నారు. అయితే కథ, కథనాలు పటిష్టంగా వ్ఞండి ప్రేక్షకులను ఆకట్టుకో గలిగితే చిన్న బడ్జెట్‌ సినిమాలు సైతం అపూర్వ విజయం సాధి స్తాయనేది చరిత్ర నిరూపించిన సత్యం. గతకాలంలో బడ్జెట్‌ను పరిమితంగా నిర్ణయించుకొని క్రమశిక్షణతో, చిత్తశుద్ధితో మంచి సినిమాలు నిర్మించగా అవి విజయం సాధించాయి.ఆ విలువలు ఇప్పుడు సినిమా రంగంలో కాగడా పెట్టి వెతికినా కనిపించవ్ఞ. థియేటర్ల యాజమాన్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

తీర్పులు మరుగున పడిపోవాలా?: -బి.ఎన్‌.సత్యనారాయణ,హైదరాబాద్‌

సమత హత్యాచారం కేసులో దోషులకు ఉరిశిక్ష విధిస్తూ అది లాబాద్‌ ప్రత్యేకకోర్టు రెండు నెలలవ్యవధిలోనే సంచలనాత్మక మైన తీర్పును వెలువరించింది. ఆ తీర్పుతో ప్రజలు, బాధిత కుటుంబం తమకు న్యాయంజరిగిందని అల్పసంతోషంతో ఆనం దంవ్యక్తంచేస్తున్నారు .విధించబడ్డశిక్షలుఅమలు జరుగుతాయా? లేదా? ఎప్పుడు అమలు జరుగుతాయి అన్న విషయాలు అమా యకులు ఆలోచించలేకపోతున్నారు. దోషులు తీర్పులు అమలు కాకుండా చట్టాలలోని లొసుగుల్ని వాడుకుంటున్నారు. అందుకే చట్టాలను సవరించాలి.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com