రైతును బలిగొన్న అప్పులు!

పురుగుల మందు తాగి ఆత్మహత్య

Farmer commits suicide by drinking insecticide
Farmer commits suicide by drinking insecticide

Bhadradri Kottagudem District: వరదలకు పంట దెబ్బతిని చేసిన అప్పులు చెల్లించలేక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.. బూర్గం పాహడ్ మండల కేంద్రంలోని పాండవబస్తీకి చెందిన బర్ల సత్యనారాయణ (40) అనే రైతు ఆత్మ‌హ‌త్య పాల్పడిన విషాద సంఘటన ఇది. ఇంటిలోనే పురుగులు మందు తాగ‌డంతో కుటుంబ స‌భ్యులు చికిత్స కోసం కొత్త‌గూడెం హాస్ప‌ట‌ల్ కు తీసుకెళ్లారు..

చికిత్స పొందుతూ బుధవారం ఉద‌యం మృతి చెందాడు.. గోదావ‌రి వ‌ర‌ద‌ల కార‌ణంగా మూడు సార్లు పంట న‌ష్ట‌పోవ‌డం, వ‌డ్డీ వ్యాపారులు అప్పు తీర్చాలంటూ వ‌త్తిడి పెర‌గ‌డంతో త‌ట్టుకోలేక ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు కుటుంబ స‌భ్యులు ఆవేదన చెందుతున్నారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/