ప్రపంచవ్యాప్తంగా 7 లక్షలు దాటిన మరణాలు
మొత్తం కేసులు 1,92,53,777

మాస్కో: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలడతాంవడం చేస్తుంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు 7 లక్షలు దాటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. ఇప్పటివరకు కరోనా వైరస్ వల్ల 7.02.642 మంది చనిపోయారని తెలిపింది. నిన్న కొత్తగా 2,59,344 కేసులు నమోదయ్యాయని, 6,488 మంది బాధితులు మృతిచెందారని వెల్లడించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,92,53,777 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 29,92,707 యాక్టివ్ కేసులు ఉండగా, 25,76,668 మంది బాధితులు కోలుకున్నారు.
50,32,179 పాజిటివ్ కేసులతో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతున్నది. 29,17,562 కరోనా కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలో ఉండగా, 20 లక్షల కేసులతో భారత్ మూడో స్థానంలో ఉన్నది. అమెరికాలో కరోనా మరణాలు ఇప్పటికే 1,62,800 దాటాయి. బ్రెజిల్‌లో లక్షకు చేరువలో ఉండగా, మెక్సికోలో 50వేలు దాటాయి. భారతదేశంలో ఇప్పటివరకు 41 వేల మంది కరోనాతో మరణించారు.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/