రష్మిక “డీప్‌ఫేక్” వీడియో సృష్టించిన వ్యక్తి అరెస్ట్

ప్రముఖ నటి రష్మిక “డీప్‌ఫేక్” వీడియో సృష్టించిన వ్యక్తిను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసారు. ప్రస్తుతం టెక్నలాజి ఎంతగా పెరిగిందో చెప్పాల్సిన పనిలేదు. గంటకో యాప్ పుట్టుకొస్తుంది. దీంతో అభివృద్ధి ఎంతగా జరుగుతుందో అదే విధంగా అనర్ధం కూడా అదే రీతిలో జరుగుతుంది. కొంతమంది టెక్నలాజి ఉపయోగిచి చెడ్డ పనులు చేస్తున్నారు. ముఖ్యంగా సినీ హీరోయిన్ల ఫేసులతో మార్ఫింగ్ వీడియోలు సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఆ మధ్య రష్మిక డెప్ ఫేక్ వీడియో ఒకటి ఎంత సంచలనం రేపిందో చెప్పాల్సిన పనిలేదు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), డీప్‌ఫేక్ టెక్నాలజీని దుర్వినియోగం చేయడం పట్ల దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కఠిన చట్టాలు తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు.

దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు.. ఈ వీడియోను సృష్టించిన వ్యక్తిని ఏపీలో అరెస్ట్ చేశారు. శనివారం ప్రధాన నిందితుడిని ఆంధ్రప్రదేశ్‌లో పట్టుకున్నారు. గతేడాది నవంబర్ 2023లో రష్మికా మందన్నా డీప్‌ఫేక్ వీడియో వైరల్ అయింది. బ్లాక్ డ్రెస్‌లో ఉన్న బ్రిటీష్-ఇండియన్ ఇన్‌ఫ్లూయెన్సర్ జరాపటేల్ వీడియోకి రష్మికా ముఖంతో మార్ఫింగ్ చేశారు. దీనిపై ఢిల్లీ పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్, 1860లోని సెక్షన్లు 465 (ఫోర్జరీ) మరియు 469 (పరువుకు హాని కలిగించడం) మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోని సెక్షన్లు 66C (ఐడెంటిటీ థెఫ్ట్) మరియు 66E (గోప్యతా ఉల్లంఘన) కింద కేసు నమోదు చేశారు.