మూడో పెళ్లి చేసుకున్న షోయబ్‌ మాలిక్‌

పాకిస్తాన్‌ వెటరన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచారు. పాకిస్తానీ నటి సనా జావెద్‌ను పెళ్లాడాడు. ఈ విషయాన్ని షోయబ్‌ మాలిక్‌ స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా తమ పెళ్లి ఫొటోలు పంచుకుంటూ.. ”జంటగా మేము ఇలా” అంటూ హార్ట్‌ ఎమోజీలు జతచేశాడు. కొన్నాళ్లుగా భార్య సానియా మిర్జాకు దూరంగా ఉంటున్న మాలిక్.. ఇప్పడూ న‌టి స‌నా జావెద్‌ను వివాహం చేసుకొని సానియాకు విడాకులు ఇవ్వబోతున్నట్లు అర్ధం అవుతుంది.

భారత టెన్నిస్‌ స్టార్‌, హైదరాబాదీ సానియా మీర్జా- షోయబ్‌ మాలిక్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2010లో వీరి వివాహం జరుగగా.. 2018లో కుమారుడు ఇజహాన్‌ జన్మించాడు. అయితే, సానియా కంటే ముందు షోయబ్‌ మాలిక్‌ అయేషా సిద్దిఖీ అనే మహిళను పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఆమె నుంచి విడిపోయిన తర్వాత సానియాను పెళ్లాడినట్లు తెలుస్తోంది.