పవన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడా..? తీసుకుంటే ఫ్యాన్స్ కు నిరాశే

పవన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడా..? తీసుకుంటే ఫ్యాన్స్ కు నిరాశే

సినీ నటుడు పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు ఒప్పుకోవడం లేదా..? తన దగ్గరికి వచ్చే డైరెక్టర్స్ కు నిర్మాతలకు నో చెపుతున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అభిమానులను ఖుషి చేసిన సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ లేకపోతే ఈపాటికి పవన్ నుండి కొత్త చిత్రాలు రెండు , మూడు వచ్చేవి. కానీ కరోనా కారణంగా షూటింగ్ లకు బ్రేక్ పడడంతో రిలీజ్ లకు బ్రేక్ పడింది.

ప్రస్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఖాతాలో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, భీమ్లానాయ‌క్‌, హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భ‌వ‌దీయుడు భ‌గత్‌సింగ్ ఉన్నాయి. రాబోయే కొన్ని నెల‌ల్లో ఈ సినిమాలు ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీలో తన జనసేన పార్టీ ని బ‌ల‌మైన రాజ‌కీయ పార్టీగా మార్చేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్న నేప‌థ్యంలో ఇక కొత్త సినిమాల జోలికి పోవ‌ద్ద‌ని నిర్ణ‌యించుకున్నాడ‌ని ఫిలింన‌గ‌ర్‌లో జోరుగా టాక్ న‌డుస్తోంది. దీని కారణంగానే సురేందర్ రెడ్డి తో చేయాల్సిన మూవీ ఆగిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగా పవన్ కొత్త సినిమాలకు నో చెపితే ఫ్యాన్స్ కు నిరాశే.