పవన్ వచ్చి న్యాయం చేసే వరకు పోరాటం చేస్తా : జనసేన వీర మహిళ నిరసన
సినిమాల్లో చాన్స్ ఇప్పిస్తానని బన్సీ వాసు మోసం చేశారు

మంగళగిరి : తనకు అన్యాయం జరిగిందని, పవన్ కల్యాణ్ వచ్చి న్యాయం చేసే వరకు తన పోరాటం ఆగదంటూ జనసేన వీరమహిళగా పోరాడిన సునీత బోయ నిన్న మంగళగిరి పార్టీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. పార్టీ కార్యాలయంలోకి వెళ్లేందుకు కూడా తనకు అనుమతి ఇవ్వలేదన్నారు. దీంతో రోడ్డుపైనే తాను ఆందోళనకు దిగాల్సి వచ్చిందన్నారు. సినీ నిర్మాత ఉదయ శ్రీనివాస్ అలియాస్ బన్సీ వాసు అనే వ్యక్తి తనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
సినిమాల్లో చిన్నచిన్న వేషాలు వేసుకుంటున్న తనకు గీతా ఆర్ట్స్ సంస్థలో బన్సీ వాసు పరిచయమయ్యారని అన్నారు. గాజువాక, భీమవరంలో పవన్ కల్యాణ్ తరపున ప్రచారం చేస్తే గీతా ఆర్ట్స్ సినిమాలో చాన్స్ ఇప్పిస్తానని చెప్పి ఆ తర్వాత మోసం చేశారని ఆరోపించారు. తనకు డ్రగ్స్ ఎక్కించి దాడికి కూడా పాల్పడ్డారని అన్నారు. పవన్ వచ్చి తనకు న్యాయం చేసే వరకు తన పోరాటం కొనసాగుతుందని సునీత తేల్చి చెప్పారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/